కరోన భయంతో గజ గజ వణుకుతున్న మెదక్ జిల్లా
కరోనా నానాటికి విస్తరిస్తుండడంతో మెదక్ జిల్లా గజ గజ వణుకుతోంది. ఇప్పటి నిత్యం కేసులు పెరగడంతో పల్లెసీమల్లో భయందోళన మొదలైంది. ఇంట్లో నుండి ఎవ్వరూ కూడా రాని పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల అధికారలు చెప్పినట్లు వైరస్ సామాజిక వ్యాప్తి మొదలైంది. గత కొన్నిరోజులుగా జిల్లాలోని పలు గ్రామాల్లో్ పాజిటివ్ కేసులు నమోదు అయినా నాటి నుండి అక్కడక్కడ మరణాలు కూడా సంబవిస్తున్నాయి. కాగా అధికారులు ప్రజలకు ధైర్యం చెబుతున్నారు.అత్యవసర సమయంలోనే ఇంట్లో నుండి బయటికి రావాలని సూచిస్తున్నారు. ఒకవేళ వచ్చినా ముఖానికి తప్పాకుండా మాస్క్ ధరించాలని కోరుతున్నారు. మాకు ఏం అవుతుందిలే అనే నిర్లక్ష్యాన్ని ప్రజలు విడనాడాలని అంటున్నారు. మనం తీసుకునే జాగ్రత్తలు మనల్ని రక్షిస్తాయని అధికారులు చెబుతున్నారు.