సచివాలయంలో అసలేం జరుగుతోంది ?
రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేతలను ప్రభుత్వం ఎందుకు దాస్తోంది. దీంతో ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏందీ, మీడియాకు తెలియజేస్తే వచ్చే నష్టం ఏందీ.ఎందుకీ దాపరీకాలు. ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో మదిలో మొదలుతున్న ప్రశ్న.
రాష్ట్ర సచివాలయంలోని జీ బ్లాక్ కింద గుప్త నిధులు, సొరంగాలు ఉన్నాయంటూ విపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారు. విపక్షాలు ఏ చిన్న ఆరోపణలు చేసినా.. అగ్గి మీద గుగ్గిలం రెచ్చిపోయి మాట్లాడే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు ఎవ్వరూ కూడా ఇప్పుడు నోరు మెదపడం లేదు. దీనిక గల కారణాలు కూడా ఎవరికీ పొక్కకుండా రాష్ట్ర సర్కార్ దాస్తోంది. దీని వెనకాల ఉన్న మతాలు గుప్త నిధులేనా,అయితే ఆ నిధులు బయట పడ్డా… బజాప్తా సర్కార్‌కి అప్పజెప్పల్సాందే… దీనికి మీడియా అనుమతి ఇవ్వక పోవడం ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల 14 రోజుల పాటు సీఎం ఫాం హౌస్‌కే పరిమిత కావడం మరింత బలాన్ని చేకుర్చింది. కొందరు విపక్ష నేతల గుప్త నిధుల కోసం రహాస్య పూజలు నిర్వహించారని ఆరోపించారు. మరో పక్క కరోనా సోకిందని ఆరోపణలు చేశారు. ఇందులో ఏది నిజమనేది అధికారికంగా ఎవరూ కూడా నిజ నిర్ధారణ చేయలేదు. కానీ ప్రభుత్వం సచివాయంలో కూల్చివేతలో చీమ కూడా దూరకుండా దాదాపు 3 కిలమీటర్ల దూరం వరకు ఆంక్షాలు విధించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్త పెనుసంచాలనాన్ని సృష్టిస్తోంది.
అయితే అక్కడ గుప్త నిధులు లేవు ఏమి లేవు. కేవల అతి తక్కువ సమయంలోనే నూతన సచివాలయ నిర్మాణం చేపట్టాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే 8 నెలలో ప్రగతి భవన్ నిర్మించి చరిత్ర సృష్టించిన సీఎం మరో చారిత్రాత్మక నిర్మాణం కోసం అడుగుతు వేస్తున్నారని నిజం. అందుకే అక్కడ ఎటువంటి ప్రమాద సంఘటనలు చోటు చేసుకోకుండా… కూల్చివేతలో నిర్మాణాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పనులను శరవేగంగా చేయడం కోసం ఎవ్వరిని అనుమతించడం లేదని వార్త అని అంటున్నారు కొందరు విశ్లేషకులు.
కానీ ఈ విషయంపై ఎటువంటి స్పష్టమైన అధికారిక ప్రకటన సీఎంఓ ప్రకటించలేదు. దీనిపై నిజం ఏంటో తెలియాలంటే… సీఎం విలేకరుల సమావేశంలో చెబితే తప్పా.. నిజా నిజాలు బయటకు రావడం కష్టమే.