అస్సాంలో వరదలు: 91 మంది మృతి

అస్సాంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటి వరకు 91 మంది బలయ్యారు. కజిరంగా నేషనల్‌ పార్క్‌లో 123 జంతువుల చనిపోయాయని అధికారులు చెప్పారు. 12 రైనోలు, 93 జింకలు, నాలుగు అడవి బర్రెలు చనిపోయాయని అన్నారు. భారీ వర్షాలకు బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిలో పొంగిపొర్లుతుందని అధికారులు చెప్పారు. ఇప్పటికే డేంజర్‌‌ లెవెల్‌ 49.68 మీటర్లకు చేరిందని, అది ఇంకా పెరిగిపోతూనే ఉందని సెంట్రల్‌ వాటర్‌‌ కమిషన్‌ ఎంప్లాయ్‌ శరత్‌ చంద్ర అన్నారు. దిబ్రూఘర్‌‌, నియమాటిఘాట్‌, తేజ్‌పూర్‌‌, గోల్‌పరా డేంజర్‌‌ లెవెల్‌లో ఉన్నాయని అన్నారు. దాదాపు 2,548 గ్రామాలు నీళ్లలో మునిగిపోయాయని అధికారులు చెప్పారు. దాదాపు 27లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ధన్సరీ నది కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోందని అన్నారు. దాదాపు 1.46 లక్షల హెక్టార్ల పంట నీట మునిగిందని అన్నారు. కజిరంగా నేషనల్‌ పార్క్‌, 152 యాంటీ పోచింగ్ క్యాంప్స్‌లో దాదాపు 92 శాతం మేర నీరు వచ్చి చేరిందని అధికారులు చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నట్లు చెప్పారు.