బ‌తుక‌మ్మ‌ల చీర‌ల‌తో మాకు ఉపాధి దొరుకుతుంది : వ‌నం శాంతి కుమార్‌

చేనేత సమస్యల పరిష్కారం కోసం సమైక్య ఉద్యమం చేయాలని చేనేత కార్మిక సంఘం పిలుపు మేరకు చేనేత కార్మికులు పోచంపల్లిలో, మోత్కూర్ లో, గట్టుప్పల్, చౌటుప్పల్, ఆత్మకూర్ లతో సహా యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు మరియు చేనేత కార్మికులు చేస్తున్న పోరాటాలకు “పోపా” యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ మద్దత్తు ప్రకటిస్తున్నాం. చేనేత కార్మికులకు వెన్నంటి ఉంటామని అన్నారు పోపా యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి వ‌నం శాంతి కుమార్‌.
రాష్ట్రంలో బతుకమ్మ చీరెలతో పవర్ లూమ్ కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. కాని అది సిరిసిల్లతో పాటు కొంతమంది కొన్ని ప్రాంతాలకే పరిమితం అయ్యిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో చేనేత వస్త్రాలపై ఆధారపడి, మగ్గాలను అంటిపెట్టుకుని జీవించే వారు ఎక్కువగా ఉన్నారు. నేడు వారు బయటి పనులకు వెళ్లలేక దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోని పేరుకు పోయిన చేనేత వస్త్రాల నిల్వలను కొనుగోలు చేయాలని, పనిలేకుండా పస్తులుండే పరిస్థితి దాపురించిన చేనేత కార్మికులకు తక్షణ సాయంగా ప్రతి కుటుంబానికి నెలకు 8000/- ఎనిమిది వేల రూపాయల చొప్పున ఐదు నెలల కాలానికి ఇవ్వాలని, ఆకలి చావులకు గురి అయిన కుటుంబానికి 1000000/- పది లక్షల రూపాయలు ఇవ్వాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యక్షంగా కంట్రోల్ కేంద్రాల సబ్సిడీపై నూలు చేనేత కార్మికులకు అందించాలని పోపా యాదాద్రి భువనగిరి జిల్లా పక్షాన పొపా జిల్లా నాయకులు పెండెం నాగార్జున, బోడ విద్యాసాగర్, మిర్యాల దామోదర్, యెర్రగుంట వెంకటేశం, కోమటి సతీష్, వల్లందాసు పరమేష్, గోశిక బాలనర్సింహ, బిట్ల అరుణ, వారాల యాదగిరి, దునుక సోమేశ్వర్, తొర్ర ఉప్పలయ్య ప్రభుత్వాన్ని కోరారు.