హిందుత్వంతోనే దేశ భవిష్యత్తు : మెదక్ భాజపా
హిందుత్వం ద్వారానే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని భాజపా పేర్కొంది. రామ మందిరం నిర్మాణం ప్రారంభ కార్యక్రమాన్ని విపక్షాలు, గిట్టని వారు రాద్దాంతం చేయాలని చేస్తున్నారని మెదక్ జిల్లా భాజపా నాయకులు సంతోష్‌రెడ్డి, మహేష్, కృష్ణ లు అన్నారు. భారత ప్రధాని వచ్చిన తర్వాత భారతదేశ ప్రతిష్టలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నాయని అన్నారు. దేశంలో కీర్తి ఘడించిన యోగాను ప్రపంచానికి చాటి చెప్పి దానికంటూ ఓ ప్రత్యేక రోజును కేటాయించడం అంటే మన హిందుత్వ గొప్పదనమని తెలిపారు. దాయది దేశం పాకిసస్తాన్ కుట్రలనె ఎప్పటికప్పుడు పసిగట్టడంతో మోడీ విరామం లేని పోరాటం చేస్తున్నారని అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి దేశ ప్రధాని వెళ్తే తప్పేంటని విపక్షాలను ప్రశ్నించారు. హిందుత్వ బాటలో దేశం ముందుకు సాగుతోందని వారు అన్నారు. భవిష్యత్తు తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం కాయమన్నారు.