తక్కువగా వాణిజ్యం జరిపిన బెంచిమార్కు సూచీలు; 0.87% తగ్గిన నిఫ్టీ, 345.51 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్

అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్

భారతీయ మార్కెట్లు రోజు చివరికొచ్చేసరికి ఫ్లాట్ గా జారిపోతున్నాయి. నిఫ్టీ, 10 వేల మార్కు పైన కొనసాగుతూ, 0.87% లేదా 93.90 పాయింట్లు తగ్గి 10,705.75 వద్ద ముగిసింది. మరోవైపు ఎస్ అండ్ పి బిఎస్ఇ సెన్సెక్స్ 0.94% లేదా 345.51 పాయింట్లు తగ్గి 36,329.01 వద్ద ముగిసింది.

సుమారు 1225 షేర్లు పెరిగాయి, 1492 షేర్లు క్షీణించాయి, 159 షేర్లు మారలేదు.

ఇండస్ఇండ్ బ్యాంక్ (4.50%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.64%), హిందూస్తాన్ యూనిలీవర్ (1.29%) నిఫ్టీ లాభాలు పొందిన వారిలో అగ్రస్థానంలో ఉన్నాయి.

నిఫ్టీ నష్టపోయిన వారిలో బజాజ్ ఫైనాన్స్ (4.62%), జీ ఎంటర్టైన్మెంట్ (4.60%), ఏషియన్ పెయింట్స్ (3.25%) ఉన్నాయి.

బిఎస్‌ఇ మిడ్‌క్యాప్, బిఎస్‌ఇ స్మాల్‌క్యాప్ వరుసగా 0.39%, 0.43% తగ్గాయి.

ఎన్‌సిసి లిమిటెడ్

వాటర్ డివిజన్‌కు సంబంధించిన రూ. 1,396 కోట్లు ఐదు కొత్త ఆర్డర్లు వచ్చినప్పటికీ ఎన్‌సిసి లిమిటెడ్ స్టాక్స్ 1.81% తగ్గి రూ. 32.55 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

జిఎంఆర్ ఇన్ఫ్రా

ఫ్రాన్స్ గ్రూప్ ఎడిపికి రెండో రౌండ్ పెట్టుబడిలో రూ. 4565 కోట్లు పెట్టుబడి పెట్టిన తరువాత, ఈ కంపెనీ తన వాటాను 49%  ఆ కంపెనీకి విక్రయించే ఒప్పందాన్ని ప్రకటించిన తరువాత, జిఎంఆర్ ఇన్ఫ్రా షేర్లు 1.42 శాతం తగ్గి రూ. 20.90 వద్ద ట్రేడయ్యాయి,

ఇండస్ఇండ్ బ్యాంక్

బ్యాంక్ త్రైమాసిక అప్డేట్స్ ను ప్రకటించిన ఫలితంగా ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నేటి ట్రేడింగ్ సెషన్‌లో 4.50% పెరిగాయి మరియు రూ. 550.00 ల వద్ద ట్రేడ్ అయ్యాయి. ఇండస్ఇండ్ బ్యాంక్‌లో తన వాటాను పెంచడానికి అమెరికాకు చెందిన హెడ్జ్ ఫండ్ రూట్ వన్ ఇన్వెస్ట్‌మెంట్ చర్చలు జరుపుతున్నట్లు మరిన్ని నివేదికలు ఈ బుల్లిష్ ధోరణికి తోడ్పడ్డాయి.

ఎస్‌బిఐ

ఆస్తుల వారీగా అతిపెద్ద ఋణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఋణ రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. నిధుల ఆధారిత-ఋణ రేటు లేదా ఎంసిఎల్‌ఆర్ రేటు యొక్క ఉపాంత వ్యయాన్ని 5 నుండి 10 బేసిస్ పాయింట్ల వరకు తగ్గిస్తామని బ్యాంక్ ప్రకటించింది. ఫలితంగా, ఎస్‌బిఐ స్టాక్స్ 1.64% పెరిగి రూ. 191.70 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

కరూర్ వైశ్యా బ్యాంక్

బజాజ్ అలియంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు కరూర్ వైశ్యా బ్యాంక్, తమ బ్యాంకు వినియోగదారులకు జీవిత బీమా పరిష్కారాలను అందించే లక్ష్యంతో కార్పొరేట్ భాగస్వామ్యంలోకి ప్రవేశించాయి. ఫలితంగా, కరూర్ వైశ్యా బ్యాంక్ షేర్లు 0.58% పెరిగి రూ. 34,80 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

ఎస్ బ్యాంక్

పబ్లిక్ ఆఫర్ లేదా ఫర్దర్ పబ్లిక్ ఆఫరింగ్ (ఎఫ్‌పిఓ) ద్వారా నిధులు సేకరించాలని ప్రైవేట్ ఋణదాతె ప్రకటించిన తరువాత ఎస్ బ్యాంక్ షేరు 1.36% పెరిగి రూ. 26.10ల వద్ద ట్రేడ్ అయింది.

సిప్లా లిమిటెడ్

ఫార్మా దిగ్గజం సిప్లా తన రెమెడిసివిర్‌ను ఒకటి లేదా రెండు రోజుల్లో ప్రారంభించబోతోంది, ఇది సావరిన్ ఫార్మా తయారీ కర్మాగారం నుండి వెలువడనుంది. అయితే, ప్రకటన చేయబడినా కూడా, కంపెనీ షేర్లు స్వల్పంగా 0.40% పడిపోయి రూ. 634,00ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

భారతీయ రూపాయి

నేటి ట్రేడింగ్ సెషన్‌లో అస్థిర దేశీయ ఈక్విటీ మార్కెట్ నడుమ భారత రూపాయి, యుఎస్ డాలర్‌తో రూ. 75.02 ల తో తక్కువగా ముగిసింది.

బంగారం

పెట్టుబడిదారులు అధిక స్థాయిలో లాభాల బుకింగ్ కోసం ఎంచుకున్నందున పసుపు లోహం నేటి ట్రేడింగ్ సెషన్‌లో ఎంసిఎక్స్ పై ప్రతికూలంగా వొగ్గుచూపడంతో ఫ్లాట్ అయ్యింది.

తక్కువగా ట్రేడ్ అయిన గ్లోబల్ మార్కెట్లు

సెషన్‌ను స్వల్పంగా ఎక్కువగానే ప్రారంభించిన గ్లోబల్ మార్కెట్లు కొంచెం అటుఇటుగా కనిపించాయి మరియు ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి తక్కువగా వర్తకం చేశాయి. నాస్‌డాక్ 0.86%, ఎఫ్‌టిఎస్‌ఇ 100 0.03 శాతం, ఎఫ్‌టిఎస్‌ఇ ఎంఐబి 0.29 శాతం, నిక్కీ 225 0.78 శాతం తగ్గాయి, హాంగ్ సెంగ్ 0.59 శాతం పెరిగాయి