లైవ్‌ క్లాస్‌ వినియోగ నిమిషాల్లో 8 రెట్ల ప్రగతిని జూన్‌ త్రైమాసికంలో నమోదు చేసిన మెరిట్‌నేషన్‌
మార్చి 2020 తో ముగిసిన త్రైమాసికంతో పోల్చితే యూజర్‌ వినియోగంలో ఎనిమిది రెట్ల పెరుగుదల

• జూన్‌ త్రైమాసికంలో 70% లైప్‌ క్లాసుల్లో పాల్గొన్నది 6-10 వ తరగతి విద్యార్థులే
• ఇదే సమయంలో మెరిట్‌మేషన్‌ వేదికపై మాక్‌ టెస్టుల ప్రాక్టీసులో ఐదు రెట్ల పెరుగుదల
లైవ్‌ మినిట్స్‌ వినియోగంలో 13x వృద్ధితో ముందు స్థానంలో ఉన్న బిహార్‌, ఝార్ఖండ్‌, 10x పెరుగుదలతో తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్‌
హైదరాబాద్: జూలై 09, 2020: భారత్ దేశంలో కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ ఎడ్‌టెక్‌ రంగం ఎదుగుదలకు ఉత్ప్రేరకంగా నిలుస్తోంది. ఆకాశ్‌ ఎడ్యూటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో భాగంగా ఉన్న ఎడ్‌టెక్‌ దిగ్గజం మెరిట్‌నేషన్‌ (టెస్ట్‌ తయారీలో అగ్రగామిగా ఉన్న ఆకాశ్‌ ఎడ్యూకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (AESL) భాగస్వామ్య సంస్థ) జూన్‌ 2020తో ముగిసిన త్రైమాసికంలో తన వేదికపై లైవ్‌ క్లాస్‌ వినియోగంలో అద్భుతమైన ఎనిమిది రెట్ల ప్రగతిని నమోదు చేసింది. K12 విద్యార్థుల కోసం ఉద్దేశించిన ప్రశ్నల ప్రాక్టీసు వేదికలో కూడా ఐదురెట్ల వృద్ధి కనిపించింది.
మార్చి 2020 త్రైమాసికంలో ఉన్న యూజర్‌ వినియోగాన్ని జూన్‌ 2020తో ముగిసిన త్రైమాసికంతో సరిపోల్చుతూ ఈ శాతాల పెరుగుదలను లెక్కించడం జరిగింది. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం లైవ్‌ మినిట్స్‌ వినియోగంలో 85% కి పైగా సైన్స్‌, మ్యాథమాటిక్స్‌ సబ్జెక్టులు తీసుకున్నాయి. మొత్తం లైవ్‌ క్లాసుల్లో 6-10 తరగతి విద్యార్థులు 70%గా ఉన్నారు.
లైవ్‌ క్లాస్‌ వినియోగంలో మెరిట్‌నేషన్‌ సాధించిన ఈ ప్రగతిలో బిహార్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాలు (13x వృద్ధి), ఆంధ్రప్రదేశ్‌ (10x వృద్ధి), అస్సాం, త్రిపుర (9x వృద్ధి), రాజస్థాన్‌ (9x), ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌, కర్ణాటక (8x) కీలక వాటాదారులుగా నిలిచాయి. భారతదేశం వెలుపల మిడిల్‌ ఈస్ట్‌లోనూ 10x వృద్ధిని సాధించింది.
ఈ అద్భుత ప్రగతిపై ఆకాశ్‌ ఎడ్యూటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ CEO నరసింహ జయకుమార్‌ మాట్లాడుతూ, “కొవిడ్‌-19 సృష్టించిన అలజడి కారణంగా విద్యార్థులు వర్చువల్‌ లెర్నింగ్‌ను అందిపుచ్చుకుంటున్నారు. ప్రతీరోజు మాకు పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యను బట్టి మేము అందిస్తున్న కరికులం, బోధన ద్వారా చాలా మంది విద్యార్థులు లాభపడుతున్నారని అర్థమవుతోంది. విద్యార్థులు ఇంట్లోనే భద్రంగా ఉంటూ వారు చదువుకునేలా మేము దీన్ని కొనసాగించడమే కాదు మరిన్ని కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకువస్తాం.”
2014లో లైవ్‌క్లాసులు ప్రారంభించిన మెరిట్‌నేషన్‌ ఆన్‌లైన్‌ బోధనలో అగ్రగామిగా ఉంది. ఇక్కడ నేటి వరకు 2.5 కోట్ల రిజిస్టర్డ్‌ విద్యార్థులు ఉన్నారు.10 మిలియన్‌ ప్లస్‌ యాప్‌ ఇన్‌స్టాలేషన్స్‌ ఉన్నాయి. 47 మిలియన్‌ టెస్టులు విద్యార్థులు ప్రయత్నించారు.
యాప్‌లెక్ట్‌ లెర్నింగ్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను కొనుగోలు చేసేందుకు ఇన్ఫోఎడ్జ్ (ఇండియా) లిమిటెడ్‌తో నిర్ధిష్టమైన ఒప్పందం కుదుర్చుకొని మెరిట్‌నేషన్‌ను జనవరి 2020లో ఆకాశ్‌ ఎడ్యూకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (AESL) కొనుగోలు చేసింది.
ఆకాశ్‌ ఎడ్యూటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ గురించి
K12 విద్యార్థుల శ్రేణి అవసరాలు తీర్చుతూ మెడికల్‌, ఇంజినీరింగ్‌ ఎంట్రెన్స్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సమగ్ర ఆన్‌లైన్ టెస్ట్‌ ప్రిపరేషన్‌ సేవలు అందించే ప్రముఖ ఆన్‌లైన్‌ బోధనా వేదిక ఆకాశ్‌ ఎడ్యూటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (AEPL). ఇది ప్రతిష్టాత్మకమైన AESL గ్రూపు (ఆకాశ్‌ ఎడ్యూకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌) అనుబంధ సంస్థ ఇది. AEPLలో రెండు ప్రత్యేక విభాగాలు ఆకాశ్‌ డిజిటల్‌, మెరిట్‌నేషన్‌ ఉన్నాయి.

ఆకాశ్‌ అకాడమీకి ఉన్న 30 ఏళ్ల అనుభవం, క్రమశిక్షణను సద్వినియోగం చేసుకుంటూ JEE, NEET, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులను ఎడ్యూ-టెక్‌ వేదికపైకి తీసుకువచ్చి వారికి ఆకాశ్‌ క్లాస్‌రూమ్‌లో అందించే నాణ్యమైన బోధనను ఇప్పుడు ఆన్‌లైన్‌లో ల్యాప్‌టాప్స్‌, డెస్క్‌టాప్స్‌, ట్యాబ్లెట్స్‌, మొబైల్స్‌ ద్వారా వారికి ఆకాశ్‌ డిజిటల్‌ అందిస్తోంది.
భారతదేశంలో పాఠశాల విద్యార్థుల మొట్టమొదటి ఆన్‌లైన్‌ బోధనా వేదిక మెరిట్‌నేషన్‌లో CBSE, ICSE, రాష్ట్రాల బోర్డులకు చెందిన విద్యార్థులు 2.5 కోట్లకు పైగా ఉన్నారు. విద్యార్థులకు బోధించేందుకు అవసరమైన వ్యక్తిగతమైన కంటెంట్‌ అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇది ఉపయోగించుకుంటుంది. 2014లో మొదటిసారిగా లైవ్‌ క్లాసులు ప్రారంభించిన మెరిట్‌నేషన్‌ ఇప్పుడు తన లైవ్‌ క్లాస్‌ వేదిక ద్వారా విద్యార్థులు తమ ఇళ్లలోనే సౌకర్యవంతంగా ఉంటూ చదువుకునేలా అత్యుత్తమ టీచర్లను వారికి కనెక్ట్‌ చేస్తోంది. సెల్ఫ్‌ స్టడీ కోర్సులను కూడా ఇది అందిస్తోంది. మేము అందించే కాన్సెప్ట్‌ వీడియోలు, టెస్టులు, స్మార్ట్‌ రిపోర్టుల వంటి విభిన్నమైన బోధనా వనరుల సాయంతో విద్యార్థులు తమకు నచ్చిన రీతిలో చదువుకుంటారు.