తెలంగాణలో 30 వేలకు చేరువలో కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా ఉధృతి పెరుగుతోంది. బాధితుల సంఖ్య 30 వేలకు చేరువైంది. బుధవారం 1,924 మందికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో కేసుల సంఖ్య 29,536కి చేరింది. ఇందులో 11,933 యాక్టివ్ కేసులుండగా.. 17,279 మంది కోలుకున్నారు. ఒక్కరోజే 11 మంది మృతి చెందారు. దీంతో మరణాలు 324కి పెరిగాయి. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,590 ఉండగా.. రంగారెడ్డిలో 99, మేడ్చల్‌లో 43, వరంగల్ రూరల్‌లో 26, సంగారెడ్డిలో 20, నిజామాబాద్‌లో 19, మహబూబ్‌నగర్‌లో 15, కరీంనగర్‌లో 14, సిరిసిల్లలో 13, వికారాబాద్‌లో 11, వనపర్తిలో 9, వరంగల్ అర్బన్‌లో 7, మెదక్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి జిల్లాల్లో 5 చొప్పున, ఖమ్మంలో 4, కామారెడ్డి, జగిత్యాల, ఆదిలాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో 3 చొప్పున, ఆసిఫాబాద్, నారాయణపేట్ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 6,363 మందికి పరీక్షలు చేయగా 4,439 మందికి నెగెటివ్ వచ్చింది.