రైతుల నడ్డి విరుస్తున్న కేంద్రం : కేశవేని కుమారస్వామి
కేంద్రం ప్రభుత్వం అడ్డు అదుపు లేకుండా పెంచిన ధరలతో రైతులు అనేక కష్టాలు పడుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ ధరల కంటే డీజీల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని కరీంనగర్ జిల్లా చింతలపల్లి గ్రామానికి చెందిన యువ రైతు కేశవేని కుమారస్వామి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పటికే కరోనా లౌక్‌డౌన్ వల్ల రైతులకు పెట్టుబడికి పైసలు కష్టమవుతుంటే డీజీల్ ధరలు పెరగడంతో ఇంకా అదనపు భారం పడుతోందని వివరించారు. రైతన్న నడ్డి విరిచేలా సర్కార్ నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో ఒక ఎకరాకు దున్నడానికి 2 వేల నుండి 3 వేల వరకు ఖర్చు అయ్యేదని ఇప్పుడు దాదాపు 4 వేలకు వరకు ఖర్చు అవుతోందని అన్నారు. దీంతో సామాన్య రైతు వ్యవసాయం చేసే పరిస్థితిలో లేరని వివరించారు. పెంచిన డీజీల్ ధరలకు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.