సీఎం కేసీఆర్‌కి బ‌హిరంగ లేఖ రాసిన రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

తెలంగాణ ముఖ్య‌మంత్రికి కల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌ఖ‌రావుకి మెద‌క్ జిల్లా ధ‌రిప‌ల్లి గ్రామానికి చెందిన యువ నాయ‌కుడు రాజ‌శేఖర్‌రెడ్డి బ‌హిరంగ లేఖ రాశారు. స్వ‌రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత అనేక కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేసినందుక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. అలాగే ఆరో విడుత హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో ఇచ్చిన హామీని వెంట‌నే నేర‌వేర్చినందుకు అభినంద‌న‌లు తెలిపారు. తొమ్మిది గ్రామాల‌తో కూడిన మాసాయిపేట నూత‌న మండ‌లంలో త‌మ గ్రామ‌మైన ధ‌రిప‌ల్లిని విలీనం చేయాల‌ని ముఖ్య‌మంత్రిని ఆయ‌న కోరారు. ప‌రిపాల‌న సౌల‌భ్యం, ర‌వాణా ఇత‌ర సౌక‌ర్యాల‌తో పోలిస్తే మాసాయిపేట త‌మ గ్రామానికి అన్ని విధాలుగా అనువుగా ఉంటుద‌ని లేఖ‌లో వివ‌రించారు. గ్రామ ప్ర‌జ‌లు ఎక్కువుగా మాసాయిపేలోని కెనారా బ్యాంక్‌లో వ్య‌వ‌సాయ‌, ఇత‌ర సాధ‌ర‌ణ ప‌నుల‌కు ఎక్కువ‌గా వినియోగిస్తార‌ని తెలిపారు. అలాగే గ‌తంలో నిత్యం వంద‌లాది మంది వివిధ ప‌నుల నిమిత్తం త‌మ గ్రామం నుండి మాసాయిపేట‌కు చేరుకుని రైలు, ఇత‌ర వాహానాల ద్వారా రాజ‌ధాని హైద‌రాబాద్ వెళ్లి వ‌స్తుంటార‌ని పేర్కొన్నారు. మాసాయిపేట‌ మండ‌లంలో విలీనం చేయ‌డం ద్వారా త‌మ గ్రామా అభివృద్ధికి దోహ‌ద ప‌డుతుంద‌ని తెలిపారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన మాసాయిపేట మండలంలో గల తొమ్మిది గ్రామాలలో ఏడుకు పైగా గ్రామాలు (తండాలు కలుపుకొని) గతంలో మాసాయిపేట గ్రామ పంచాయతీ పరిధిలోనివే అని అని ఆయన తెలిపారు. ఇలా ఏర్పాటు చేసిన మండలం ద్వారా అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు ప్రయోజనం లేదని,రెవెన్యూ పరంగా ప్రభుత్వం నష్టపోయే అవకాశం ఉందన్నారు. అలాగే ఇప్పుడున్న మండ‌లాల‌తో పోలిస్తే మాసాయిపేట మండ‌లం భౌగోళికంగా చిన్న‌ది ఉండ‌నుందన్నారు. దీంతో ప్రజలకు ప్రాంతంపై ప‌ట్టు ఉండే అవకాశం లేదని ఆయన వివరించారు. ఇవే కాకుండా మాసాయిపేట లో చేర్చిన కొన్ని గ్రామాలు మరియు ధ‌రిప‌ల్లి గ్రామం ప్రస్తుతం హరిద్ర నదిగా పిలువబడుతున్న హల్దీ వాగుకు సరిహద్దుగా ఉన్నాయని తెలిపారు. దీంతో పాటు ఈ గ్రామాలకు 0.5 టి.ఎం.సి కెపాసిటీ గల సాగునీటి ప్రాజెక్టు తో సైతం ఉమ్మడి వాటాలు ఉన్నాయని భవిష్యత్తులో నీటి పంపాకాల విషయాలలో ప్రాంతీయ భేదాలు సైతం తలెత్తే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని ధర్పల్లి గ్రామాన్ని మాసాయిపేట మండలంలో లో చేర్చాలని ఆయన కోరారు.అలాగే గ‌తంలో త‌మ గ్రామాన్ని మాసాయిపేట మండ‌లంలో విలీనం చేస్తామ‌ని గ్రామ ప్ర‌జ‌లు ఏక‌గ్రీవ తీర్మానం చేస్తూ సంత‌కాలు చేశార‌ని లేఖ‌లో ముఖ్య‌మంత్రికి వివ‌రించారు. కావునా ద‌య‌చేసి త‌మ అభ్య‌ర్థ‌న‌ను స్వీక‌రించి త‌మ గ్రామ ప్ర‌జ‌లు కోరిక‌ను నేర‌వేర్చాల‌ని సీఎంను రాజ‌శేఖ‌ర్ రెడ్డి కోరారు.