చైనా యాప్స్ నిషేధం స్వాగతించాలి : సంతోష్‌రెడ్డి
దేశ భద్రతే లక్ష్యంగా టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మెదక్ జిల్లా భాజపా శ్రేణులు స్వాగతిస్తున్నారు. విశేష జనాదరణ పొందిన టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, వియ్ చాట్, షేర్ ఇట్ తదితర యాప్‌లను దేశంలో నిషేధించడం దేశ ప్రయోజనాల విషయంలో తీసుకున్న ఓ సాహసోపేతమైన అడుగుగా భాజపా నాయకుడు వెంకన్నగారి సంతోష్‌రెడ్డి అభివర్ణించారు. దేశ ప్రయోజనాల విషయంలో ఇదో ధైర్యంతోకూడిన చర్యని అన్నారు. భారత్ స్వయం సమృద్ధి సాధించే దిశగా దోహదం చేస్తుందని పేర్కొన్నారు. భారతీయ పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి ప్రజలకు కొత్త ఆవిష్కరణలను అందించాల్సిన సమయమిదేనని పిలుపునిచ్చారు.