ఘ‌ట్‌కేస‌ర్‌లో క‌రోనా క‌ల‌క‌లం

ఘ‌ట్‌కేస‌ర్ క‌రోనా పాజ‌టివ్ కేసుల క‌ల‌క‌లం రేగింది. ఒకే రోజు ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ఘ‌ట్‌కేస‌ర్ భ‌యం గుప్పిట్లోకి వెళ్లింది. ఇంట్లో నుండి ఎవ్వ‌రూ కూడా బ‌య‌ట‌కు రాని ప‌రిస్థితి నెల‌కొంది. 60 ఏళ్ల వ‌యసుగ‌ల మ‌హిళ ఇటీవ‌ల ఓ అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రైన‌ట్టు స‌మ‌చారం. మ‌రో మ‌హిళ కు ఎలా సోకిందో అన్న స‌మాచారం తెలియాల్సి ఉంది. ఓ ఒక్క‌రూ కూడా అత్య‌వ‌స‌ర ప‌నుల నిమిత్తం త‌ప్పా బ‌య‌ట‌కు రావ‌ద్దు అని అధికారులు, పోలీసులు ప్ర‌జ‌ల‌కు తెలిపారు. ఓ వైపు హైద‌రాబాద్‌లో క‌రోనా కేసులు పెర‌గ‌డం…. ఉద్యోగ రీత్యా ప్ర‌జ‌లు నిత్యం హైద‌రాబాద్ వెళ్లి రావ‌డంతో స్వ‌చ్చంద లౌక్‌డౌన్ పాటించాల‌ని ప్ర‌జ‌లు మున్సిప‌ల్ శాఖ‌కి విజ్ఞ‌ప్తి చేశారు. ఇందుకు ఆ శాఖ ఒప్పుకున్న‌ట్లు స‌మాచారం. కాగా ఎప్ప‌టి నుండి పూర్తి లౌక్‌డౌన్ ప‌ట్ట‌ణంలో కొన‌సాగిస్తారో తెలియాల్సి ఉంది. ఇక క‌రోనా సోకిన ఇంటి చుట్టు కంటైన్మెమెంట్ జోన్‌గా ప్ర‌క‌టించారు. అక్క‌డి వెళ్ల‌నివ్వ‌కుండా అధికారులు సూచిక‌లు ఏర్పాటు చేశారు.