అచ్చంపేట, హాకింపేట అడవులను ఎందుకు నాశనం చేసారు : ‌తెజ‌స‌

అడువులు పెంచి హరితవిప్లవం తీసుకరావాలి అనేది సర్కార్ లక్ష్యం. కానీ సంవత్సరాల క్రితం నుండి అడవులుగా ఉన్న వాటిని పూర్తిగా నరికివేసి, ఫామ్ హౌస్లు, కోళ్ల ఫారంలు, మామిడి తోటలు, రక రకలా భవనాలు కడుతున్న వారిపై ప్రభుత్వం ఏ చట్టం కింద వారిని శిక్ష వేస్తుందో చెప్పాలని మెదక్ జిల్లా తెలంగాణ జన సమితి యువజన విభాగం అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆరో విడుత హరితహారం కార్యక్రమాన్ని మొదలు పెట్టిన నర్సాపూర్ లో సీఎం మాట్లాడుతూ అడవులు ఉన్న జిల్లా మెదక్ జిల్లా దాన్ని కాపాడుకోవాల్సిన అక్కెర మనకు ఉంది అన్నారని గుర్తు చేశారు. కానీ అదే నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం అచ్చంపేట, హాకింపేట అడవిలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రికి సంబంధించిన కోళ్లఫారం పెట్టి అడివిని ధ్వసం చేశారు అని ఆరోపించారు. అతనితో పాటు అనేక మంది వందలాది ఎకరాల అడివిని నరికి విలాసవంతమైన ఫామ్ హౌస్ లు నిర్మించుకుంటున్నారని విమర్శించారు. వాటి వల్ల ఆ అడివిలో నిర్మించిన హల్దీ ప్రాజెక్ట్ కి వచ్చే వరద నీరు రాకుండా ఆగం అయింది అని ఆరోపించారు. ఒక మంత్రి పదవిలో ఉన్నవారే అడవులని ధ్వసం చేస్తూ పోతుంటే… మీరు కోట్ల రూపాయలతో హరితహారం అంటూ ప్రజలను ఎందుకు మోసం చేస్తారు అని ప్రశ్నిచారు. 44 జాతీయ ర‌హాదారి నుండి చిన్న‌శంక‌రంపేట మండ‌లం ధ‌రిప‌ల్లి వ‌ర‌కు 7 కిలోమీట‌ర్ల ర‌హాదారిలో గ‌తంలో ద‌ట్ట‌మైన అడ‌వి ఉండేద‌న్నారు. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని చూస్తే.. ఏదో పారిశ్రామిక వాడ‌ల ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వెల్దుర్తి, చిన్న‌శంక‌రంపేట మండ‌లాలోని కొన్ని గ్రామాల‌కు సాగునీరు అందించే ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తిగా నిర్వీర్యం అయింద‌న్నారు. దీంతో రైతుల‌కు పెద్ద దెబ్బ అని పేర్కొన్నారు. అడ‌విలో వన్య ప్రాణాలు ఉండేవ‌ని అడ‌విగుండా గ్రామాల‌కు వ‌స్తున్న‌ప్పుడు దుప్పులు, జింక‌లు, నెమ‌ళ్లు ఇలా అనేక వ‌న్య ప్రాణాలు కనిపించేవ‌ని… ఇప్పుడు ఆ కోళ్ల ఫారం నుండి వెలుబ‌డే ద‌ట్ట‌మైన దుర్గదం పీల్చుకుంటూ… గ్రామాల‌కు వెళ్తున్నామ‌ని తెలిపారు. అచ్చంపేట, హాకింపేట శివారులో ఉన్న భూమి పట్టా భూములు అని ఎలా నిర్ణయించారు, వాటిని అమ్ముకునే హక్కు ఎవరికీ ఉంది,  అసలు దానికి వెనక ఉన్న లోగుట్టు ఏంటో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అని దీనిపై ముఖ్య మంత్రి, మంత్రులు ఇంద్ర కిరణ్ రెడ్డి, కేటీఆర్, ఈటెల సమాధానం చెప్పాలని రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలను మభ్య పెట్టడం వల్ల మీరు ఏమి సాధించలేరు అని అన్నారు. ఈ అంశంపై సరైన వివరణ ఇచ్చి, న్యాయం జరిపించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాము అని హెచ్చరించారు.