తెలంగాణ పోలీస్ శాఖ‌లో సంచ‌ల‌నం

తెలంగాణ పోలీస్‌శాఖ‌లో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఐపీఎస్ డీజీ వికె సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయ‌న తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. త‌న రాజీనామా ను కేంద్ర హోంశాఖ మంత్రి కి పంపారు. కొంత కాలంగా ప్రభుత్వం పై అసంతృప్తి గా ఆయ‌న ఉన్నార‌ని తెలుస్తోంది. అయితే ఈ ఏడాది నవంబర్ 30 న అత‌ని ప‌ద‌వికాలం ముగియ‌నున్న‌ది. ఇంతలో రాజీనామా చేయ‌డం వెనుక ఉన్న ఆంతార్యం ఎంటో ఎవ‌రికి అంతుప‌ట్టండం లేదు. అక్టోబర్ 2 న ప్రీ రీటైర్మెంట్ ఇవ్వాలని లేఖ లో పేర్కొన్నారు. తన కు ఐపీఎస్ గా కొనసాగడం ఇష్టం లేదన్న త‌న లేఖ‌లో వివ‌రించారు. జైళ్ల శాఖ డీజీ గా పని చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన వికె సింగ్ ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం విస్మ‌యానికి గురి చేసింది. మొదటి నుండి పోలీస్ వ్యవస్థ పై అసహనం వ్యక్తం చేసిన వికె సింగ్…ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలతో తన జీవితం కొనసాగిస్తానన్న వికె సింగ్ లేఖ‌లో వివ‌రించారు.
లేఖ‌లో వివ‌రించిన వివ‌రాలు
పోలీస్ వ్యవస్థను మార్చాలనే గొప్ప ఆశయంతో డిపార్ట్ మెంట్ లోకి వచ్చా..
కానీ ఆశయాలను నెరవేర్చడంలో సఫలం కాలేకపోయాను..
నా సేవలతో తెలంగాణ ప్రభుత్వం అంతగా సంతృప్తి కాలేకపోయింది..
నేను ఇచ్చే సలహాలు, సూచనలు ప్రభుత్వానికి పెద్దగా నచ్చలేదని భావిస్తున్నా..
నా వల్ల ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తకూడదని అనుకుంటున్నా..
సేవాభావంతో తెలంగాణ ప్రజలకు మరింత దగ్గర కావాలని యోచిస్తున్నా..
అందుకే పదవీ విరమణ చేయాలని నిర్ణయించుకున్నాను..
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలని ఎప్పుడూ భావించలేదు..
స్పష్టమైన మనశ్శాక్షితో నడవాలని భావించే వాళ్లు డిపార్ట్ మెంట్ లో చేరొచ్చు..
పోలీస్ డిపార్ట్ మెంట్ లో విలువైన పాఠాలను నేర్చుకున్నాను..