ఆలేరులో అలుపెరగని పోరాటం చేస్తాం : వనం శాంతి కుమార్
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నిన్న సోషల్ మీడియాలో ఒక వ్యక్తి పద్మశాలి కులస్తులను కించపరుస్తూ, అసభ్యకర వ్యాఖ్యలతో కూడిన పెట్టిన పోస్టు పెనుదుమారం రేపుతోంది. తెలంగాణా రాష్ట్రములోని, జిల్లాలోని పద్మశాలి కులస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారంగా వీరు ఎవరి తెరువు పోయే వారు కాదు. కరోనా వలన బతుకు తెరువు లేక ఆకలి చావులకు గురవుతున్నారు.ఇలాంటి కష్ట కాలంలో ఉన్న చేనేత కార్మికులను ఆదుకునేది పోయి కించపరిచే విధంగా పోస్టింగ్ పెట్టడం సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నది. ఇది సమాజ అభివృద్ధికి మంచిది కాదు. తక్షణమే పోలీస్ అధికారులు, ప్రభుత్వం వెంటనే నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఇలాంటివి మున్ముందు జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము మరియు ఆలేరులో పోరాటం చేస్తున్న పద్మశాలి కులస్తులకు ” పద్మశాలి ఆఫీసియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (పోపా)” యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ మద్దత్తు ప్రటిస్తుందని యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం శాంతి కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరిక చేశారు. సరైన తీర్పు రాకపోతే ఆలేరులో అలుపెరగని ఉద్యమం చేస్తామన్నారు.











