క‌రోనా మందు 103 రూపాయ‌లే

మహమ్మారికి మందు కనిపెట్టారు. గత మూడు నెలలుగా ముప్పు తిప్పలు పెడుతున్న కరోనా వైరస్ ని నిలువరించేందుకు ఔషధం సిద్ధమైంది. భారత ఫార్మా దిగ్గజ కంపెనీ గ్లెన్ మార్క్ కరోనా నివారణ మందును కనుగొన్నట్లు వెల్లడించింది. ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసినట్లు తెలిపింది. ఫవిపిరవిర్, ఉమిఫెనోవిర్ అనే రెండు యాంటీ వైరస్ ఔషధాలపై అధ్యయనం చేసిన గ్లెన్ మార్క్ ఫవిపిరవిర్ ఔషధం స్వల్ప లక్షణాలున్న వారికి పనిచేస్తుందని వెల్లడించింది. ఫాబిప్లూ బ్రాండ్ పేరిట ఈ ఔషధం మార్కెట్లు విడుదల చేసేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతులు లభించాయని తెలిపింది. గ్లెన్ మార్క్ ముంబయికి చెందిన ఔషధ నియంత్రణ సంస్థ.
దేశవ్యాప్తంగా ఈ ఔషధాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని గ్లెన్ మార్క్ ఛైర్మన్ గ్లెన్ సల్థన్హా వెల్లడించారు. ఒక్కో టాబ్లెట్ రూ.103 లకు విక్రయిస్తారని, డాక్టర్ రాసిచ్చిన మందుల చీటీ ఉంటేనే మందు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కరోనా బారిన పడిన వారు 1800 ఎంజీ మాత్రలను మొదటి రోజు రెండు సార్లు వేసుకోవాలని.. ఆ తరువాత 14 రోజుల పాటు 800 ఎంజీ మాత్రలను రోజుకు రెండు సార్లు వేసుకోవాల్సి ఉంటుందని సూచించారు. ఈ మందులను డయాబెటిక్ పేషెంట్లు, గుండెజబ్బులు ఉన్న వారు కూడా వాడవచ్చని తెలిపారు. ఈ మందులు వాడిన మొదటి నాలుగు రోజుల్లోనే వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతుందని అన్నారు.