7992 కోట్ల సొమ్ము ఏక్కడికి పోయింది ? : రేవంత్ రెడ్డి
కరోనా సమయంలో వచ్చిన సాయం, విరాళాలల గురించి సీఎం కేసీఆర్ శ్వేత ప్రతం విడుదల చేయాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సోషల్ మీడియా ద్వారా విరాళాలు, సహాయం, ఖర్చుల వివరాలు వివరిస్తూ… మిగిలిన 7992 కోట్లు ఎక్కడికి వెళ్లాయో చెప్పాలని ప్రశ్నించారు. ఆ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
కేంద్రం కరోనా నిర్మూలనకు తెలంగాణ రాష్ట్రానికి రూ. 6082 కోట్లు ఇచ్చింది.
- విరాళాలు రూ. 500 కోట్లు.
- ఉద్యోగుల జీతాల కోతతో మిగిలినవి రూ. 4000 కోట్లు.
- మొత్తం:: రూ. 10582 కోట్లు.
✍ ఒక్క కరోనా రోగికి కోలుకోవడానికి అయ్యే ఖర్చు రూ. 3.5 లక్షలు. మొత్తం 1100 రోగులకు అయ్యే ఖర్చు : రూ. 39 కోట్లు.
✍ ఇప్పటి వరకు జరిగిన మొత్తం కరోనా అనుమానితుల పరీక్షలు 20000 మందికి. ఒక్కొక్కరికి రూ. 4500 ఖర్చు. మొత్తం కరొనా పరీక్షలకు ఖర్చు రూ. 9 కోట్లు.
✍ క్వారంటైన్ లో ఉన్న ఒక్కరికి ఒక రోజు ఖర్చు రూ. 500. మొత్తం 30000 మందికి 28 రోజుల క్వారంటైన్ ఖర్చు : రూ. 42 కోట్లు.
✍ ఆస్పత్రుల ఏర్పాటు: రూ. 100 కోట్లు.
✍ రాష్ట్రం పేదలకు ఇస్తున్న రూ.1500 లకు : రూ. 1200 కోట్లు.
✍ 12 కిలోల బియ్యం విలువ : రూ.1000 కోట్లు.
✍ ఉద్యోగుల బోనస్: రూ. 100 కోట్లు.
✍ ఇతరములు : రూ. 100 కోట్లు. - మొత్తం ఖర్చు : సుమారు రూ. 2590 కోట్లు మాత్రమే.
మరి మిగిలిన రూ. 7992 కోట్ల సొమ్ము ఏక్కడికి పోయింది ?