పోలీసులు కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు : రెడ్డిప‌ల్లి యువ‌కుడి ఆవేద‌న‌

ఏదైన అన్యాయం జ‌రిగితే న్యాయం కోసం పోలీసుల ద‌గ్గ‌రి వెళ్తాం. ఇగ అక్క‌డ ప‌ట్టించుకోక‌పోతే ఏం చేయాల‌ని ప్ర‌శ్నిస్తున్నాడు ఓ యువ‌కుడు. మెద‌క్ జిల్లా న‌ర్సాపూర్ మండ‌లం రెడ్డిప‌ల్లికి చెందిన మంగ‌ళి చంద్ర‌శేఖ‌ర్ గ‌త స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌లో ఓ వార్డ్ నుండి పోటీకి దిగారు. కానీ దుర‌దృష్ట‌వశాస్తూ అత‌ను ఓడిపోయారు. ఆ స‌మ‌యంలో డిపాజిట్ చేసిన డ‌బ్బులు తిరిగి తీసుకునే విష‌యంలో ప‌లుమార్లు స‌ర్పంచ్‌కి చంద్ర‌శేఖ‌ర్‌కి గొడ‌వ‌లు జ‌రిగాయి. కాగా పోర్జ‌రీ సంత‌కాల‌తో ఆ డబ్బుల‌ను సర్పంచ్ డ్రా చేసుకున్నార‌ని చంద్ర‌శేఖర్ ఆరోపించారు. ఈ విషయంపై అధికారుల‌కు గ‌తంలో పిర్యాధు చేశార‌నే నేపంతో అత‌నిపై దాడా చేశార‌ని చెబుతున్నారు. ఈ విష‌యం పోలీసుల‌కు, ఇత‌ర ఉన్న‌తాధికారులు ఎన్నిసార్లు మొర‌పెట్టుకున్నా.. స్పందించడం లేద‌ని చంద్ర‌శేఖ‌ర్ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. చివ‌రికి జిల్లా ఎస్సీకి కూడా పిర్యాధు చేసినా… స్పంద‌న లేద‌ని అంటున్నారు. ఇక మ‌రోవైపు స‌ర్పంచ్ అత‌ని సోద‌రుల‌తో త‌న‌కు ప్రాణాహాని ఉంద‌ని ఇప్ప‌టికైన పోలీసులు స్పందించాల‌ని చంద్ర‌శేఖ‌ర్ కోరుతున్నారు.