ఇదేనా మెద‌క్‌లో మీరు చేసిన అభివృద్ధి : తెజ‌స

పొరుగు నియోజ‌క‌వ‌ర్గాల‌ను చూసి మెద‌క్ ఎమ్మెల్యే సిగ్గ‌ప‌డాల‌ని మెద‌క్ జిల్లా తెలంగాణ జ‌న‌స‌మితి యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి విమ‌ర్శించారు. స్వ‌రాష్ట్రం సాధించుకున్న త‌ర్వాత కూడా మెద‌క్ ఇంకా వెన‌క‌బాటు త‌నానికి గుర‌వుతునే ఉంద‌న్నారు. ఏనాడు కూడా అభివృద్ధిలో ముందుకు పోలేద‌ని పేర్కొన్నారు. ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా నుండి విడిపోయిన సిద్ధిపేట నియోజ‌క‌వ‌ర్గం ఎలా అభివృద్ధిలో దూసుకుపోతుందో ప్ర‌జ‌లు చెబుతున్నారు. గతంలో సీఎం కేసీఆర్ మెద‌క్ కి ఇచ్చిన హామీల గురించి స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేద‌న్నారు. మెద‌క్ చుట్టూ ఔట‌ర్ రింగ్ రోడ్డు, అద్దాలాంటి రోడ్లు ఎక్క‌డికి వెళ్లాయ‌ని ప్ర‌శ్నించారు. చిరుజ‌ల్లు ప‌డితేనే మెద‌క్ ఆర్‌టీఓ ఆఫీస్ పోవ‌డానికి న‌రక‌యాత‌న ప‌డుతున్నారు ఇది క‌నిపించ‌డం లేదా అని ప్ర‌శ్నించారు. జిల్లాలో అనేక ప‌ర్య‌టాక ప్రాంతాలు ఉన్నాయ‌ని వాటిని అభివృద్ధి చేసే ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వానికి లేద‌న్నారు. ఆలోచ‌న ఉంటే సిద్ధిపేట‌కు ధీటుగా మెద‌క్ అభివృద్ధి జ‌రిగేద‌న్నారు. గ‌జ్వేల్‌, సిద్ధిపేట‌, సిరిసిల్లా త‌ప్పా రాష్ట్రంలో వేరు నియోజ‌క‌వ‌ర్గాలు సీఎంకి క‌నిపించ‌డం లేద‌ని విమ‌ర్శించారు. ‌