క‌రోనాపై పొలంప‌ల్లిలో ఇంటింటి ప్ర‌చారం : భాజాపా

క‌రోన వైర‌స్ గురించి ప్ర‌తి ఒక్క‌రికీ అవ‌గాహాన అవ‌స‌ర‌మ‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ పేర్కొంది. ప్ర‌జ‌ల్లో అవ‌గాహాన క‌ల్పించ‌డానికి ప్ర‌త్యేక కార్య‌క్ర‌మానికి శ్రీకారం చూట్టింది మెద‌క్ జిల్లా భాజ‌పా. ఇందులో భాగంగా.. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో లోని పొలంపల్లి గ్రామంలో బిజెపి జిల్లా నాయకులు కొండి స్వామి, చేగుంట మండల యువ మోర్చ అధ్యక్షుడు చంద్ర శేఖర్ గౌడ్, సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ గౌడ్ ప్రధాని నరేంద్ర మోదీ గారి లేఖ ఇంటింటికి తిరుగుతూ ఇచ్చారు. కరోన వ్యాధి నిర్మూలనకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని బయటకు వెళ్లే ముందు మాస్క్ కచ్చితంగా ధరించాలని చేతులు శుభ్రంగా అరగంటకు ఒకసారి శుభ్రం చేసుకోవాలని వారు సూచించారు. శానిటైజర్ వాడాలని ప్రజలకు వివ‌రించారు. ఈ కార్యక్రమంలో గణేష్, బాల్ రాజ్,నవీన్,విజయ్ తదితరులు పాల్గొన్నారు.