హెక్టర్ ప్లస్ ఉత్పత్తిని ప్రారంభించిన ఎంజీ మోటార్ ఇండియా
హెక్టర్ ప్లస్ ఆకట్టుకునే కొత్త రూపంతో మరియు సౌకర్యవంతమైన కెప్టెన్ సీట్లను కలిగి మీ ముందుకు వస్తోంది
ఎంజీ (మోరిస్ గ్యారేజీలు) మోటార్ ఇండియా, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హెక్టార్ ప్లస్ వాణిజ్య ఉత్పత్తిని ఈరోజు ఆవిష్కరించింది. అత్యాధునిక హలోల్ ప్లాంట్ లో తయారు చేసిన హెక్టర్ ప్లస్‌ను ఆటో ఎక్స్‌పో 2020 లో మొదటిసారిగా ప్రదర్శించారు మరియు ఇది జూలై 2020 లో విక్రయించబడుతోంది. హెక్టర్ ప్లస్ భారతదేశంలోని మొట్టమొదటి ఇంటర్నెట్ కారు, ఇది మధ్య వరుసలో కెప్టెన్ సీట్లను కలిగి ఉండి విభిన్నంగా ఉంటుంది, తద్వారా ప్రయాణీకులకు ఉత్తమ-తరగతి సౌకర్యాన్ని అందిస్తుంది. కుటుంబ అవసరాలకు అనుగుణంగా మూడవ వరుసను కూడా చేర్చారు. ఈ ఉన్నత-ప్రదర్శన గల ఎస్‌యూవీలో ఆల్-న్యూ హెడ్‌ల్యాంప్స్, ఫ్రంట్ గ్రిల్, ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, న్యూ రియర్ టైల్ లైట్ డిజైన్ మరియు రివైజ్డ్ స్కిడ్ ప్లేట్‌లు అమర్చబడి ఉన్నాయి. ఎంజీ మోటార్ ఇండియా చీఫ్ ప్లాంట్ ఆఫీసర్. మనీష్ మానేక్ మాట్లాడుతూ, ఇలా అన్నారు, “టీనెజర్స్కి మూడవ వరుసలో మరియు మధ్య వరుసలో కెప్టెన్ సీట్లు ఏర్పరచడం ద్వారా వారి నిర్దిష్ట కుటుంబ అవసరాలను తీర్చడం హెక్టర్ ప్లస్ లక్ష్యం. హెక్టర్ బ్రాండ్ కుటుంబాన్ని మరింత పెంచుతూ, హెక్టర్ ప్లస్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఉత్తమమైన తరగతి భద్రత మరియు సరిపోలని సౌకర్యంతో తెలివిగా ఎంపిక చేసుకుంటుంది.”
ఎంజీ వారి హలోల్ ప్లాంట్ ప్రస్తుత ప్రమాణాలకు మించి ప్రపంచంలోనే ఉత్తమ తయారీ ప్రమాణాలతో, ఉత్పత్తి పారామితులను అనుసరించి, వివిధ కఠినమైన నాణ్యత పరీక్షలకు లోనవుతున్నాయి. ఎంజీ హెక్టర్ ప్లస్ అనేది విప్లవాత్మక ఓవర్ ది ఎయిర్ (ఓటిఎ) టెక్నాలజీతో అనుసంధానించబడి, సాఫ్ట్‌వేర్ / ఫర్మ్‌వేర్, ఫీచర్ థీమ్స్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ కంటెంట్‌ను సజావుగా అప్‌డేట్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. దేశవ్యాప్తంగా ఎంజీ హెక్టర్ యొక్క భారీ విజయంపై, బ్రిటిష్ కార్ల తయారీదారు వారి ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు.