భయం భయంగా తూప్రాన్ పట్టణం
తూప్రాన్‌లో కరోన వైరస్ సృష్టించిన ప్రళయం అంతా ఇంతా కాదు. ఇంట్లో నుండి కాలు బయటకి పెట్టాలంటే జనం జంకుతున్నారు. ఎంత అత్యవసరమైన పనులు వాయిదా వేసుకోవడానికే మెగ్గు చూపుతున్నారు. కరోనా కేసలు నమోదు కావడం, మరణాలు సంబవించడం చూస్తుంటే పరిస్థితి చేయి దాటిపోతోందని భయందోళనలో ఉన్నారు. ఏకంగా స్వచ్ఛంధంగా లాక్‌డౌన్ పాటిస్తున్నారు అంటే పరిస్థితిలో ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుండి వచ్చేవారు తూప్రాన్ రావాలి అంటే భయపడుతున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు వహిస్తున్నారు. రోడ్లపై ఎక్కువ జన సంచారం లేకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. ఇటీవల మెదక్ జిల్లాలో కరోనా కేసులు నమోదు కావడం అధికారులను ఆందోళనలో నెట్టాయి. కాగా నిన్న మంత్రి ఈటెల రాజేందర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… వైరస్ ఒకరి నుండి మరొకరికి పాకం తక్కువ స్థాయిలో ఉందని చెప్పడం గమనార్హం.