మనం అమెరికాను దాటేస్తామా ?
కరోనా పాజిటివ్ కేసుల్లో భారతదేశం అమెరికాను దాటినా అశ్చర్యపోనవసరం లేదని ఆ దేశానికి చెందిన యేల్ స్కూల్ ఆఫ్ మెడిసన్ శాస్త్రవేత్త మనీషా జుతానీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమెరి కాలో 21 లక్షల కేసులు నమోదయ్యాయి. మనదేశంలో సోమవారానికి నమోదైన కేసుల సంఖ్య 3,32,424కు చేరు కున్నది. మూడు రోజులుగా దేశంలో సగటున 11వేలకు పైగా కేసులు నమోద వుతున్నాయి. ఈ నేపథ్యం లోనే మనీషా జుతానీ తన అంచనాలను వెలువరిం చారు. ఈ ఏడాది చివరి దా కా భారత్‌లో కేసుల పెరుగు దల నమోదవుతూనే ఉంటుం దని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రత తగ్గేలోపు ఇండియాలో కేసులు అమెరికాను దాటేస్తాయన్నారు.