చైనాలో కరోనాకి మందు కనుగొన్నారా ?
కోవిడ్–19కు టీకా కనుగొనే దిశగా ముందడుగు వేసినట్లు చైనా కంపెనీ సైనోవాక్ బయోటెక్ ఆదివారం ప్రకటించింది. తమ ‘కరోనా వాక్’టీకా మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు వెలువడ్డాయని వెల్లడించింది. తొలి దశలో 143 మంది వాలంటీర్లు, మలి దశలో 600 మంది వాలంటీర్లు తమ ట్రయల్స్‌లో పాల్గొన్నారని పేర్కొంది. ఈ ట్రయల్స్‌లో 90% కన్నా ఎక్కువ మందిలో సానుకూల ఫలితాలు వచ్చాయని తెలిపింది. వారిలో తీవ్రస్థాయి సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ కనిపించలేదని పేర్కొంది.
త్వరలో చైనా ‘నేషనల్ మెడికల్ ప్రాడక్ట్స్ అడ్మినిస్ట్రేషన్’కు పూర్తి వివరాలు అందజేస్తామని, అనంతరం, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ విదేశాల్లో నిర్వహించేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేస్తామని వెల్లడించింది. బ్రెజిల్‌కు చెందిన ‘ఇన్‌స్టిట్యూటొ బూటాంటన్’సంస్థతో కలిసి విదేశాల్లో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామంది. ‘తొలి, మలి క్లినికల్ ట్రయల్స్ విజయవంతం కావడంతో కోవిడ్–19పై పోరులో కీలక దశకు చేరుకున్నాం. కరోనావాక్ సురక్షితమైందని మా ట్రయల్స్‌లో తేలింది’అని సైనోవాక్ ప్రెసిడెంట్, సీఈఓ వీడాంగ్ యిన్ ప్రకటించారు.