అసెంబ్లీలో చెప్పినవన్నీ అబద్దాలేనా దొర : తెజస
కరోరా రానే రాదంటివి.. వస్తే మాస్క్‌లు కట్టుకోకుండానే యుద్దం చేస్తానంటివి… అగర్‌సే వస్తే వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి అడ్డుకుంటానని చెప్పితివి ఇది అంతా అబద్దమేనా ముఖ్యమంత్రి అంటూ విమర్శించారు మెదక్ జిల్లా తెలంగాణ జన సమితి యువజన అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి. రాష్ట్రంలో కరోనా కేసులు విచ్చల విడిగా పెరుగుతుండటంతో ప్రభుత్వానికి ఏం చేయాలో అర్ధం కావడం లేదన్నారు. అందుకే రోజుకో మాట చెబుతూ… ప్రజలన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. గత అసెంబ్లీలో కరోనాపై మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి అయినా సరే కరోనాని అడ్డుకుంటామని చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇవాళ ఆరోగ్య శాఖ మంత్రి ప్రైవేట్ హాస్పిటల్స్‌లో కరోనా ట్రీట్‌మెంట్ కోసం వివిధ రకాల టారీఫ్‌ని ప్రకటించడం వెనుక ఉన్న ఆంతార్యం ఏంటో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. అంతేకానీ పేదలకు కరోనా వస్తే గాంధీ వెళ్లాలి మీ పార్టీ ఎమ్మెల్యేలకు వస్తే మాత్రం యశోధ ఆసుపత్రికి వెళ్లాలా అని ప్రశ్నించారు. మెదక్ జిల్లాలలో కరోనా చాపకింద నీరులా పాకుతోందని అన్నారు.