ఆకాశ్‌ ప్రైమ్‌ క్లాస్‌ ద్వారా లాంగ్‌ టర్మ్‌ కోర్సులు ప్రారంభించిన ఆకాశ్‌ ఎడ్యూకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (AESL)

• JEE, NEET కోసం ప్రయత్నిస్తున్నXI, XII క్లాసు వారికి మరియు XII పాసైన వారికి ఒక సంవత్సరం, రెండు సంవత్సరాల కోర్సు నిర్వహిస్తున్న ఆకాశ్‌ ప్రైమ్‌ క్లాస్‌
• VIII, IX, X తరగతి విద్యార్థులకు లాంగ్‌ టర్మ్ ఫౌండేషన్ కోర్సులు కూడా అందిస్తోంది
• విద్యార్థులు వారు ఉండే ప్రదేశంతో సంబంధం లేకుండా “గ్యాప్‌ను బ్రిడ్జ్‌” చేసే లక్ష్యంతో రూపొందించిన కోర్సు వారిని పరీక్షలకు సరిగ్గా సన్నద్ధం అయ్యేలా చేస్తుంది
• ఆడియో-వీడియో పరికరాలతో రూపొందించిన క్లాస్‌రూమ్‌ నుంచి ఇంటర్నెట్‌ ద్వారా లైవ్‌ స్ట్రీమ్‌ అవుతుంది. ఆకాశ్‌ ప్రైమ్‌ క్లాస్‌ అన్నది టూ-వే ఇంటరాక్టివ్‌ మీడియం
• విద్యార్థులు వారు చదువుకునే నగరం/పట్టణంలోని క్లాస్‌ రూమ్‌ నుంచి లైప్‌ స్క్రీన్‌ ద్వారా ఢిల్లీలోని ఆకాశ్‌ ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ కావచ్చు

విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయడంలో జాతీయ స్థాయిలో అగ్రగామి సంస్థ ఆకాశ్‌ ఎడ్యూకేషన్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (AESL), ఇప్పుడు ఆకాశ్‌ ప్రైమ్‌ క్లాస్‌ ద్వారా VIII నుంచి XII వరకు, XII పాసైన విద్యార్థులకు లాంగ్‌ టర్మ్‌ కోర్సులు ప్రారంభించింది. ఎక్స్‌ టెండెట్‌ క్లాస్‌ రూమ్‌ కోర్సుగా ఉండే ఈ కోర్సులను అధునాతన శాటిలైట్‌ టెక్నాలజీ ద్వారా అందిస్తుంది. VIII నుంచి X వ తరగతి విద్యార్థులకు ఒకటి నుంచి రెండు సంవత్సరాల ఫౌండేషన్‌ కోర్సు అందుబాటులో ఉంటుంది. అలాగే డాక్టర్లు, ఐఐటీయన్లు కావాలని ఆకాంక్షిస్తున్న XI, XII తరగతి విద్యార్థులకు, XII పాసైన విద్యార్థులకు ఒకటి, రెండు సంవత్సరాల పాటు కోర్సు నిర్వహించడం జరుగుతుంది. మరింత సమాచారం కోసం విద్యార్థులు www.primeclass.aakash.ac.in లో లాగ్‌ ఇన్‌ అవ్వండి. JEE, NEET కి సంబంధించిన కోర్సుల నిర్దిష్ట సమాచారాన్ని https://www.aakash.ac.in/prime-course- jee/ మరియు https://www.aakash.ac.in/prime-course-neet/ లో కూడా చూడవచ్చు.

ఈ ఊహించని సమయంలో విద్యార్థుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ, ఈ క్లాసులను యూట్యూబ్‌ ద్వారా నేరుగా విద్యార్థుల నివాసాలకు లైవ్‌ స్ట్రీమ్‌ చేయడం జరుగుతుంది. ఆకాశ్‌ ప్రైమ్‌క్లాస్‌ అన్నది టూ-ఇంటరాక్టివ్‌ మీడియం. ఒలింపియాడ్స్, JEE, NEET కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు ఇంట్లోనే సురక్షితంగా ఉంటూ క్లాస్‌ రూమ్‌ వాతావరణంలో ఢిల్లీలోని ఆకాశ్‌ ఫ్యాకల్టీతో లైవ్‌ స్క్రీన్‌ ద్వారా ఇంటరాక్ట్‌ అవ్వొచ్చు.
వివిధ బోర్డు పరీక్షలు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సమీకృత బోధనా అనుభవాన్ని అందించే లక్ష్యంతో ఈ ప్రోగ్రామ్‌ రూపొందించడం జరుగుతుంది. హై-డెఫినిషన్‌ ప్రొజెక్షన్ సిస్టమ్, హై-రెజల్యూషన్‌ క్లాస్‌ రూమ్‌ కెమెరా ఉపయోగించి ప్రత్యేకమైన AV ద్వారా తరగతులు అందించడం జరుగుతుంది. విద్యార్థులను చూసేందుకు, వారిని వినేందుకు, వారితో మాట్లాడేందుకు AESL ఫ్యాకల్టీలు స్మార్ట్ అసెస్‌మెంట్‌ సిస్టమ్, ఆడియో-వీడియో సదుపాయాలు, స్మార్ట్ అటెండెన్స్ సిస్టమ్‌ మొదలైనవి ఉపయోగిస్తారు. రెగ్యులర్‌ క్లాస్‌రూమ్‌ తరహాలోనే విద్యార్థులు చూడవచ్చు, వినవచ్చు, లెక్చర్‌లో ఇంటరాక్ట్ అయి ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే ఫ్యాకల్టీని అడగవచ్చు కూడా.
లాంగ్‌-టర్మ్ కోర్సులు ప్రారంభించిన సందర్భంలో AESL డైరెక్టర్‌, సీఈఓ ఆకాశ్‌ చౌదరి మాట్లాడుతూ, “ ఈ సంక్షోభ సమయంలో JEE, NEET పరీక్షలతో పాటు ఒలింపియాడ్స్‌కు సిద్ధమవుతున్న విద్యార్థులకు వారు ఉండే ప్రాంతాలతో సంబంధం లేకుండా పూర్తిస్థాయి సహకారం అందించేందుకు మేము కృషి చేస్తున్నాం. ఆకాశ్‌ ప్రైమ్‌ క్లాస్‌ల సృజనాత్మక బోధనా అనుభవం, క్రమం తప్పకుండా నిర్వహించే పరీక్షలు, విశ్లేషణల ద్వారా విద్యార్థులు తమ చదువులు మెరుగుపరుచుకోవచ్చు. మా సెషన్స్ ఇంటరాక్టివ్‌గా ఉంటాయి కాబట్టి విద్యార్థులు తమ డౌట్స్ తీర్చుకోవచ్చు, ప్రశ్నలు అడిగి సమాధానాలు పొందవచ్చు. ఈ వినూత్న ప్రయత్నాన్ని విద్యార్థులు అందిపుచ్చుకుంటారని మేము భావిస్తున్నాం.”
AESL నేషనల్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఆకాశ్‌ ప్రైమ్‌ క్లాస్‌ కోర్సులు అందించడం జరుగుతుంది. VSAT ఆధారిత ఈ కేంద్రాల్లో అత్యాధునిక స్టూడియోలు, టెలికమ్యూనికేషన్ సదుపాయాలు ఉన్నాయి. ఆడియో, వీడియో హై-క్వాలిటీ డేటా ద్వారా విద్యార్థులకు ఫ్యాకల్టీ బోధిస్తారు.

ఆకాశ్‌ ప్రైమ్‌ క్లాస్‌ ప్రయోజనాలు
• దేశంలోనే ఆకాశ్ ఫ్యాకల్టీ అత్యుత్తమైనది, ప్రతీ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు అందిస్తున్నారు.
• AESL అందిస్తున్న స్టడీ మెటీరియల్‌ అద్భుతమైనదిగా ప్రశంసలు పొందింది, ఆశావహులందరూ దీన్ని కోరుకుంటారు.
• PLAతో ( ప్రీ లెర్నింగ్ అసెస్‌మెంట్‌) పాటు ఉపయోగించే వెబ్‌ ఆధారిత టెక్ట్స్, మల్టీ మీడియా పాఠాలు వేగాన్ని పెంచుతాయి.
• ఇన్‌-క్లాస్‌ బోధనను అంచనా వేసేందుకు ఇన్‌-క్లాస్‌ ఎక్సర్‌సైజులు నిర్వహించడం జరుగుతుంది. ఇది విద్యార్థి-ఫ్యాకల్టీ మధ్య లెర్నింగ్‌-గ్యాప్‌ అనాలసిస్‌, కరెక్టివ్‌ యాక్షన్‌కు చేయూతనిస్తుంది.
• రీకాల్‌, రివిజన్‌తో పాటు హయ్యర్‌ ఆర్డర్‌ ప్రిపరేషన్‌ కోసం పోస్టు క్లాస్‌ అసైన్‌మెంట్లు అందించడం జరుగుతుంది.
• విద్యార్థుల సందేహాలు తీర్చేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
• క్లాస్‌ షెడ్యూల్స్, టెస్టులు, అసైన్‌మెంట్స్‌ తెలియజేసేందుకు ప్లానర్స్ సమకూర్చుడం జరుగుతుంది.
• నిర్వహించే ప్రతీ సెషన్‌ రికార్డు చేయడం జరుగుతుంది, వాటిని తర్వాత కావాలనుకుంటే విద్యార్థి తమ స్టూడెంట్‌ ఐడీ ద్వారా చూసుకోవచ్చు.
• పర్ఫామెన్స్ పరిశీలించి తగిన చర్యలు తీసుకునేందుకు ఆన్‌ లైన్‌ రివ్యూ సెషన్స్ నిర్వహించడం జరుగుతుంది.
• క్వెరీ రికార్డు చేసేందుకు, క్వెరీ ట్రాక్‌ చేసేందుకు అందుబాటులో అకాడమిక్‌ హెల్ప్ డెస్క్
• ఈవెంట్లు, మార్పులు, స్కోర్లు, అసైన్‌మెంట్‌ కంప్లిషన్‌/ఇన్‌ కంప్లిషన్‌కు సంబంధించి ఫ్యాకల్టీకి, తల్లిదండ్రులకు ఈమెయిల్‌/SMS అలర్ట్స్ పంపించడం జరుగుతుంది.

ఇప్పుడు ఆకాశ్‌ ప్రైమ్‌ క్లాసులు విద్యార్థులకు వారి సొంత ఊళ్లలోనే అందుబాటులో ఉన్నాయి కాబట్టి చిన్న పట్టణాలకు చెందిన విద్యార్థులు ప్రిపరేషన్‌ కోసం పెద్ద నగరాలకు రావాల్సిన అవసరం లేదు. ఢిల్లీలో ఉండే అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ నుంచి వారు పూర్తి శిక్షణ పొందవచ్చు. బెస్ట్‌ ఇన్ క్లాస్‌ కంటెంట్‌, టెస్టులు, 24×7 సందేహాలు తీర్చే వ్యవస్థ, వీడియో ఆర్కైవ్స్ అన్ని అందుబాటులో ఉంటాయి. అంతే కాదు తమ పిల్లల ఆరోగ్యం, భద్రత గురించి ఇక తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.