వీడియో ఆధారిత కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ (వి-సిఐపి) ను ప్రారంభించిన ఎస్బీఐ కార్డ్
~ వీడియో కేవైసీ ప్రాసెస్ అందిస్తుంది తిరుగులేని, సురక్షితమైన, కాంటాక్ట్ లెస్ కస్టమర్ ఆన్-బోర్డింగ్ ~
భారతదేశపు అతిపెద్ద ప్యూర్-ప్లే క్రెడిట్ కార్డ్ జారీదారు అయిన ఎస్బీఐ కార్డ్ నేడిక్కడ వీడియో నో యువర్ కస్టమర్ (వికెవైసి) ఫీచర్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. జీరో కాంటాక్ట్, ఇబ్బంది రహిత కస్ట మర్ ఆన్-బోర్డింగ్ ప్రక్రియకు ఇది వీలు కల్పిస్తుంది. మొదటి నుంచి చివరి దాకా కాగితపు రహిత, డిజిటల్ సోర్సింగ్ మరియు ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను అందించాలన్న ఎస్‌బిఐ కార్డ్ ప్రయత్నానికి అనుగుణంగా ఇది ప్రారంభమైంది. వీకేవైసీ ప్రయోగం అనేది మోసాల తగ్గింపుపై గణనీయమైన ప్రభావాన్ని చూపడమే కాక, కేవైసీ ప్రక్రియ వ్యయాన్ని దాదాపు సగానికి తగ్గిస్తుంది.
ఇ-సైన్ ప్రాసెస్‌తో పాటు కస్టమర్ ఐడెంటిటీని నిరూపించుకునే పద్ధతిగా విసిఐపిని అనుమతిస్తూ ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మార్గదర్శకాలను అనుసరించి ఎస్‌బిఐ కార్డ్ వికెవైసిని ప్రారంభించింది. వీకేవైసీ
అనేది సరళమైన, భౌతిక ఉనికి అవసరం లేని కార్యకలాపాలకు వీలు కల్పిస్తుంది. ఇక్కడ కస్టమర్ ఎవరితోనూ భౌతి కంగా సంభాషించాల్సిన అవసరం లేదు. డిజిటల్ కస్టమర్ ఆన్‌బోర్డింగ్ ప్రయాణంలో, డిజిటల్ దరఖాస్తు ఫారమ్ పై దరఖాస్తుదారుడి నుండి డిజిటల్ సంతకాన్ని పొందడంలో ఇ-సైన్ ప్రాసెస్ సహాయపడుతుంది. తాను అందించిన వివరాలను ధ్రువీకరించడానికి దరఖాస్తుదారు తన దరఖాస్తు ఫారమ్‌ను పిడిఎఫ్ ఆకృతిలో స్వీకరిస్తారు. వివరాలను ధ్రువీకరించిన తరువాత, దరఖాస్తుదారు డిజిటల్ గా దరఖాస్తు ఫారమ్ పై ఇ-సైన్ చేస్తారు, దాంతో కార్డు ప్రాసెసింగ్ ప్రారంభమవుతుంది.
వికెవైసిని ప్రారంభించడం గురించి ఎస్బిఐ కార్డ్ ఎండి & సిఇఒ హర్ దయాల్ ప్రసాద్ మాట్లాడుతూ “మాది టెక్నాలజీ ఆధారిత సంస్థ. విని యోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి గాను బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ వద్ద అత్యాధునిక మౌలిక సదుపాయాలను అందించేందుకు గాను వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టాం. అడుగడుగునా కస్టమర్ ప్రయాణాన్ని డిజిటలైజ్ చేయడానికి, మొత్తం ప్రక్రియను తిరుగులేనిదిగా చేయడానికి సాంకేతికతను సూక్ష్మస్థాయి నుంచి అమలు చేయడం జరిగింది. జీవితాన్ని సరళం చేయాలనే మా ఆశయానికి అనుగుణంగా, మా కస్టమర్ల కోసం సురక్షితమైన, ఏఐ చోదిత, డిజిటల్ ప్రయాణం – వీడియో కేవైసీ ని ప్రారంభిస్తున్నందుకు మేం సంతోషిస్తున్నాం. కాంటాక్ట్ లెస్ ప్రాసెస్ ద్వారా అధిక స్థాయి భద్రతతో పాటు వాడుకలో సౌలభ్యాన్ని ఇది అందిస్తుంది. భౌతిక దూరం అనేది ఓ నిబంధనగా మారిన సందర్భంలో, ఈ ఫీచర్ మా కస్టమర్లకు ఎంతో ఔచిత్యాన్ని కలిగి ఉంది. ఇది గణనీయమైన స్పందన పొందుతుందని మేం ఆశిస్తున్నాం” అని అన్నారు.
భౌతిక దూరం పాటించడం అనేది కొత్త సాధారణమైనందున, ఎవరితోనైనా ముఖాముఖిగా సంభాషించాల్సిన అవసరం లేకుండా, వీకేవైసీ ఒక కస్టమర్ పూర్తి భౌతిక ఉనికి రహిత ప్రయాణానికి వీలు కల్పిస్తుంది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం, ముఖ గుర్తింపు, డైనమిక్ వెరిఫికేషన్ కోడ్, ఏఐ ఎనేబుల్డ్ ఓసీఆర్, లైవ్ ఫోటో క్యాప్చర్ ఫేషియల్ రికగ్నిషన్, ఓసీఆర్,జియోట్యాగింగ్ మొదలైన వాటిని ఉపయోగించే వీకేవైసీ ప్రక్రియ దీన్ని భౌతిక కేవైసీ ప్రక్రియ కంటే మరింత సురక్షితం మరియు భద్రమైందిగా చేస్తుంది.