లాక్‌డౌన్ క‌ఠిన స‌మ‌యంలో ర‌క్త‌దానం చేసిన “బ్లడ్ డోనార్ లైఫ్ సేవర్ ఫౌండేషన్”

కోవిడ్ -19 మaహమ్మారి విజృంభిస్తున్న సమయంలో దేశ వ్యాప్తంగా రక్త నిల్వలు కొరవడిన ఈ సమయం లోను తమ సేవలు కొనసాగిస్తున్నాం అని చెబుతున్నారు “బ్లడ్ డోనార్ లైఫ్ సేవర్ ఫౌండేషన్” ప్రతినిధులు. ప్రపంచ రక్తదాన దినోత్సవం 14 జూన్ 2020 పురస్కరించుకొని రక్తదాతలకు శుభాకాంక్షలు తెలియజేసారు. బ్లడ్ డోనార్ లైఫ్ సేవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సునీల్ ధూట, కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ తరుణంలో కూడా ముందుకు వచ్చి రక్త దానం చేస్తున్న దాతలకు అయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్బంగా బ్లడ్ డోనార్ లైఫ్ సేవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సునీల్ ధూట మాట్లాడుతూ 2015 సంవత్సరంలో చిన్న ప్రయత్నంగా స్థాపించిన ఈ ఫౌండేషన్ ఈ రోజు దాదాపు 500 మంది రక్తదాతలతో ముందుకు సాగుతుంది. సంస్థ ప్రతినిధులు కేవలం ప్రత్యక్షంగా మాత్రమే తక్తదానం చేస్తారు. ఎక్కడైనా రక్తం అవసరం వుంది అని తెలిసిన వెంటనే మేము స్పందించి రక్తదానం చేయానికి వెళ్తాము. వాట్సాఆప్ వేదికగా నడిచే మా ఫౌండేషన్ ఇప్పటి వరకు దాదాపు 900 వరకు ప్రత్యక్ష రక్త దానాలు చేసాం. హైదరాబాద్ నగరం లోనే కాకుండా తెలంగాణ లోని వివిధ పట్టణాలలోను మా సంస్థ ప్రతినిధులు రక్తదానం చేస్తున్నారు. సంస్థ వ్యవస్థాపకుడిగా నేను 19 సార్లు రక్తదానం మరియు ప్లేట్ లెట్స్ , వైట్ బ్లడ్ సెల్స్ డొనేట్ చెసాను. మా ఈ సంస్థ కేవలం సంస్థ సభ్యుల సహకారం ప్రోత్సహం తో ముందుకు సాగుతుంది. ఎవరైనా రక్తదాత కోసం మమ్మల్ని +91 74166 18510 ద్వారా సంప్రదించవచ్చని వ్యవస్థాపకులు సునీల్ ధూట తెలిపారు.
బ్లడ్ డోనార్ లైఫ్ సేవర్ ఫౌండేషన్ రక్తదానంకి మాత్రమే పరిమితం కాకుండా వివిధ సామజిక సేవలోను ముందు ఉంటుంది. కరోనా లొక్డౌన్ లో నిస్సహాయులు అయినా 240 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణి చెయ్యడం, వివిధ అనాథ ఆశ్రమలకు నిత్యావసర సరుకులు, విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు, స్కూల్ యూనిఫార్మ్స్ పంపిణి చేసారు. అంతే కాకుండా మట్టి వినాయకుడిని ప్రోత్సహించాలని ఉచిత మట్టి వినాయక విగ్రహాలను పంపిణి చేసారు.
ఈ మధ్యకాలంలో కాన్సర్ తో బాధపడుతున్న ఒక బాధితురాలికి 15 వేల ఆర్థిక సహాయం చేయడం, మరియు గుండె సంబంధిత వ్యాధితో పుట్టిన 18 రోజుల బాబుకి గుండెకు సంబంధించిన ఆపరేషన్ కి 25 వేల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. కేరళ లో వరదలు వచ్చిన సమయంలోను సంస్థ నుండి కేరళ సీఎం డిస్ట్రెస్ రిలీఫ్ ఫండ్స్ కి 21 వేల సహాయం చేసారు.