ఆన్ లైన్ క్లాసులు పిల్లలకి మంచిదేనా ?
కరోనా లాక్ డౌన్ వల్ల విద్యావ్యవస్థ పూర్తి నిర్వీర్యం అయ్యిందని చెప్పుకోవాలి. మాములు నిబంధనల ప్రకారం ఇప్పటికే అన్ని పాఠశాలలు తెరుచుకోవాలి. కానీ కరోనా భయంతో ఆగష్టు15 వరకు ఆ ఊసే ఎత్తవద్దు అని ప్రభుత్వం ఖరాకండిగా చెప్పింది. దీంతో అన్ని ప్రైవేట్ పాఠశాలలు ఏం చేయాలో అనే ఆలోచనలో పడ్డాయి. దీంతో సరికొత్తగా ఆన్ లైన్ క్లాసులు అంటూ తెరమీదకి తీసుక వచ్చాయి. అసలు ఈ ఆన్‌లైన్ విద్య పిల్లలకు మంచిదేనా అనేది ఇప్పుడూ చూద్దాం. అసలు ఈ ఆన్‌లైన్ క్లాసులు సామాన్య మానవుడి ఎంతటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే…
ఆన్‌లైన్ క్లాస్ ఇది నడవాలి అంటే… ఓ స్మార్ట్ ఫోన్ లేదా..ట్యాబ్ లేదా ఇతర సామాజిక మాధ్యమం ఖచ్చితంగా ఉండాలి. ఇవి అన్ని ఏ ఏ పాఠశాలలో చదివే వారికి అందుబాటులో ఉన్నాయి అనేది సరైన లెక్కలేదు. అన్ని ప్రైవేట్ పాఠశాలలు తమ ఇష్టానుసారంగా ప్రభుత్వం నుండి ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే ఆన్‌లైన్ క్లాస్‌లు మెదలు పెట్టాయి. ఓ వైపు ప్రైవేట్ యాజామాన్యలు మీ పిల్లల భవిష్యత్తుకి ఆన్‌లైన్ తీర్చిదిద్దుతాము అంటూ మీరు ఓ స్మార్ట్ ఫోన్ కొనుకొండి అని చెబుతున్నారు. అసలే లాక్‌డౌన్ వల్ల ఇప్పటికే నిత్యం పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఇది సామాన్య ప్రజలపై అధిక భారం పడుతోంది.
ఇక స్మార్ట్ ఫోన్‌ని పిల్లలు ఉపయోగించడం ద్వారా అనేక సమస్యలు రానున్నాయి. చిన్నపిల్లలు నుండి పదవ తరగతి వరకు చదివే వారు ఆన్‌లైన్ ద్వారా పాఠలు వినడంతో… వారి కంటి చూపుపై అధిక భారం పడనుంది. అదే పనిగా ఫోన్ చూడడం వాటిలోనే సమాధానాలు ఇవ్వడం ద్వారా కంటి చూపు తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో చూపు మందగించే ప్రమాం ఉందని తల్లిదండ్రులు వాపోతున్నారు ఈ ఆన్లైన్ క్లాసుల జరిపే స్కూల్ లపై వెంటనే విద్యాశాఖ మరియు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుచున్నారు
ప్రభుత్వం చెప్పే దాకా ఎలాంటి క్లాసులు ప్రారంభం చేయకూడదని ఈ సందర్భంగా తెలంగాణ సమాచార హక్కు చట్టం ఫోరమ్ వ్యవస్థాపక అధ్యక్షుడు గద్ద తిరుపతి యాదవ్ ప్రభుత్వం ను కోరారు. అలాంటి స్కూల్ లపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.