మంత్రి ఈటల రాజేందర్ ఓఎస్‌డీ కరోనా పాజిటివ్

క‌రోనా ప్ర‌జాప్ర‌నిధుల‌ను, వారి సంబంధిత అధికారుల‌ను వ‌ద‌ల‌డం లేదు. ఇటీవ‌ల మంత్రి హారీష్‌రావు ఏపీకి క‌రోనా సోక‌గా… ఇవాళ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్ ఓఎస్‌డీకి కూడా క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ముఖ్య‌మంత్రి కార్యాల‌యం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. క‌రోనా క‌ట్ట‌డి కోసం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలో అధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. కాగా మంత్రి ఈటెల ఓఎస్‌డీ నిన్నవ‌ర‌కు ఆయ‌న‌తో కలిసి ప‌ని చేశారు. అయితే మంత్రికి కూడా క‌రోనా టెస్ట్‌లు నిర్వ‌హిస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఇప్ప‌టికే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మ‌రియు గోవ‌ర్థ‌న్‌రెడ్డికి క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే.