ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా #PledgeToDonate కాంపెయిన్ ని ప్రారంభించిన షేర్ చాట్
ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్బంగా ఇండియన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ షేర్‌చాట్
#PledgeToDonate ని ప్రారంభించింది. రక్తదానం గురించి అవగాహన కల్పించడానికి ఈ ప్రచారాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపింది. నెల రోజులలో
60 మిలియన్ల క్రియాశీల వినియోగదారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
భారతదేశం రక్త నిల్వల కొరతతో ఉందని రక్తదానం చేసే చొరవతో ప్రతిజ్ఞ చేసి పాల్గొనాలని షేర్ చాట్ కోరుతోంది.
మెడికల్ జర్నల్ ది లాన్సెంట్ నిర్వహించిన పరిశోధన ప్రకారం ప్రపంచంలో భారతదేశం రక్తం నిల్వలు లేక కొరతతో ఉందని తెలిపింది. అన్ని రాష్ట్రాలు కలిసి 41 మిలియన్ యూనిట్ల కొరతతో ఉన్నాయని పేర్కొంది. సరఫరా కంటే డిమాండ్ 400% పైగా ఉంది. 2011 జూన్ 11 నుండి ప్రారంభమయ్యే 4 రోజుల ప్రచారం కార్యక్రమంలో వినియోగదారుల స్వంత భావన మరియు బాధ్యత పట్ల ప్రదర్శించడంపై దృష్టి పెడుతుంది. రక్తదానం ద్వారా దేశంలోని ప్రజలను కాపాడవచ్చు అని తెలిపింది. ఈ వేదికలో సెల్ఫీ ప్రచారంతో రక్తదానం చేయడానికి వినియోగదారులను ఆహ్వానిస్తుంది