ధ‌రిప‌ల్లి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మేసేజ్‌కి స్పందించిన మంత్రి హారీష్‌రావు

ఎక్క‌డ ఏ చిన్న క‌ష్టం వ‌చ్చినా ఆదుకుంటాన‌ని మంత్రి హారీష్‌రావు మ‌రోసారి నిరూపించారు. త‌న ఫోన్‌కి వ‌చ్చిన మేసేజ్‌కి నెంబ‌ర్‌కి కాల్ చేసి మ‌రీ స‌మ‌స్య తెలుసుకొని క్ష‌ణాల్లో ప‌రిష్కారం చేశారు మంత్రి. వివ‌రాల్లోకి వెళ్తే… మెద‌క్ జిల్లా చిన్న శంక‌రంపేట మండంలం ధ‌రిప‌ల్లి గ్రామానికి చెందిన బందువులు చేగుంట మండ‌లం చెట్ల తిమ్మ‌యిప‌ల్లి గ్రామంలో చాక‌లి రాజు అనే వ్య‌క్తి బిల్డింగ్ మీద నిద్రిస్తున్న స‌మ‌యంలో నిద్ర‌లో లేచి న‌డుస్తూ కింద ప‌డి చ‌నిపోయాడు. శవ పంచ‌నా నిమిత్తం గ‌జ్వేల్‌లోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి పోలీసులు త‌ర‌లించారు. కానీ అక్క‌డి ఆసుప‌త్రి సిబ్బంది నిర్ల‌క్ష్యం వ‌హిస్తూ… పంచ‌నామా నిర్వ‌హించ‌డం ఆల‌స‌త్వం చేశారు. దీంతో ధ‌ర‌ప‌ల్లి గ్రామానికి చెందిన చాక‌లి మ‌హేష్ త‌మ గ్రామ‌స్థుడైన వీర‌య్య‌గారి రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి ఫోన్ చేసి ప‌రిస్థితి వివ‌రించాడు. వెంట‌నే రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మంత్రి హారీష్‌రావుకి మేసేజ్ ద్వారా ప‌రిస్థితిని వివ‌రించారు. వెంట‌నే స్పందించిన మంత్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి నుంచి పూర్తి వివ‌రాలు తెలిసుకొని త‌క్ష‌ణ‌మే గ‌జ్వేల్ ఆసుప‌త్రికి ఫోన్ అధికారుల‌పై మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల సేవ చేయ‌డానికి మాత్ర‌మే మ‌నం ఉన్నామ‌ని వారికి ఏ ఇబ్బందులు రాకుండా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఫోన్ క‌ట్ చేసిన వెంట‌నే అర‌గంట‌లో శవ‌పంచ‌నామాకి సంబంధించిన వాటిని పూర్తి చేసి పంపించారు. త‌క్ష‌ణ‌మే స్పందించిన మంత్రి హారీష్‌రావుకి అభినంద‌న‌లు తెలిపారు. ఇటీవ‌ల ధ‌రిప‌ల్లి గ్రామానికి చెందిన ఓ యువ‌కుడు ప్ర‌మాదం గురైన‌ప్పుడు కూడా మంత్రి కేటీఆర్‌కి ఫోన్ ద్వారా సంప్ర‌దించి స‌మ‌స్య ప‌రిష్కారానికి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కృషి చేశారు. దీంతో ధ‌రిప‌ల్లి గ్రామ ప్ర‌జ‌లు అత‌నిని అభినందించారు.