లాక్‌డౌన్‌లో సూపర్ యాప్‌గా అవతరించిన వాక్య యాప్
ప్రధాని ఇచ్చిన ‘వోకల్ ఫర్ లోకల్’ పిలుపుతో ఉత్తేజం పొందిన వాక్య మీట్
లాక్ డౌన్ సమయంలో అద్భుత ప్రగతి సాధించిన ఈ ‘మేడ్ ఇన్ ఇండియా’ యాప్
వాక్య అనే డిజిటల్ కాన్ఫరెన్సింగ్ యాప్ గత పది వారాలుగా దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ సమయంలో అద్భుతమైన వృద్ధి సాధించింది. కొవిడ్-19 తరుణంలో దీన్ని ఉచితంగా ఉపయోగించుకునే వీలుండటంతో ఏకంగా 30 వేల మంది దీనిలో కొత్తగా సైనప్ అయ్యారు. దాంతో ఇది ‘మేడ్ ఇన్ ఇండియా’ యూనిఫైడ్ కమ్యూనికేషన్స్ అండ్ కొలాబరేషన్ యాప్ విభాగంలో అది పెద్దదిగా అవతరించింది.
వాణిజ్య సంస్థలలోని ఉద్యోగులకు, వర్చువల్ బృందాలతో పాటు.. క్షేత్రస్థాయిలో ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం, ఆరోగ్యరంగ, విద్యా, ఇతర రంగాల వారందరికీ వాక్య ఎంతగానో ఉపయోగపడుతుంది. వాళ్లంతా ఒకే గదిలో కూర్చుని పనిచేస్తున్న అనుభవాన్ని ఇది రియల్-టైంలో కలిగిస్తుంది. వాణిజ్య లావాదేవీలను సులభతరం చేసుకోడానికి, ఫలితాలు మెరుగుపరుచుకోడానికి, రోజువారీ కార్యకలాపాలను అత్యంత భద్రతతో చేసుకోవడం ద్వారా సామర్థ్యాన్ని పెంచుకోడానికి వాక్య ఉపయోగపడుతుంది. ఇందులోని ప్రాథమిక అంశంగా భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం ఇందుకు దోహదం చేస్తుంది.
ఈ యాప్ గురించి, దాని వృద్ధి గురించి వాక్య వ్యవస్థాపకుడు చంద్ర ఎస్. పోతినేని మాట్లాడుతూ, ‘‘ఇప్పటికే వేలాదిమంది మా యాప్ ను ఉపయోగించుకున్నారు, వీరి సంఖ్య స్థిరంగా పెరుగుతోంది. ఈ ఉత్పత్తి చాలా సులభంగా ఉందని యూజర్లు అభినందిస్తున్నారు. డిజైన్, డెవలప్ మెంట్, డిప్లాయిమెంట్, తమ నెట్ వర్కులు, అప్లికేషన్ల నిర్వహణలో భద్రతకు వాక్య అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. అత్యాధునిక వెబ్ ఆర్టీసీ & మీడియా ప్రమాణాలకు అనుగుణంగా ఈ యాప్ తయారైంది. ఇది అవసరమైన అన్ని భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉంది. ఎలాంటి బ్యాండ్ విడ్తులోనైనా పనిచేసేలా ఉండటం వల్ల వాక్య యాప్ ప్రతి ఒక్కరికీ అనుకూలంగా ఉంటుంది. ఎవరికి వారు ప్రతి ఒక్కరూ మొత్తం సమావేశ నాణ్యతను నిర్వహించేలా ఇది ఉంటుంది’’ అని తెలిపారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం, వాక్య ప్రధానంగా డేటా లోకలైజేషన్ మరియు ప్రైవసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. వాక్య సమావేశాలన్నీ భారతీయ సెర్వర్లలోనే కొనసాగుతాయి. విదేశీ మొబైల్ అప్లికేషన్లను నిషేధించాలన్న ఆలోచనలో భారత ప్రభుత్వం ఉండటం వల్ల.. మన దేశ అవసరాలకు సరైన పరిష్కారంగా వాళ్ల డేటా లోకలైజేషన్, సెక్యూరిటీల విషయంలో వాక్య మంచి పరిష్కారం.
వాక్య గురించి:
సంస్కృతంలో వాక్య అంటే తెలియజేయడం అని అర్థం. ఏ ప్రొడక్ట్ అయినా కూడా ఉత్పాదన చేసే వారు ఎలా చేస్తే అలానే వినియోగదారుడు వాడుకోవలసి వస్తోందే తప్ప ఇంకొక మార్గం ఉండట్లేదు. అన్ని యూసీసీ ప్రొడక్టులు ఇలానే ఉంటున్నాయి. ఇదే మేము మార్చాలనుకుంటున్నాము – ప్రాంతీయంగా డిప్లాయ్ చేయగలిగి, సెక్యూరిటీ గైడ్‌లైన్లకి అనుగుణంగా, యూజర్లు తమకి వీలుగా మార్చుకునే విధంగా, క్లైంట్‌కి కూడా వారి పరిసరాలకి, సిస్టంలకి తగినట్టుగా మార్చుకునే రీతిలో ఒక ప్రొడుక్టుల శ్రేణిని తీసుకురావాలి. వాక్య కస్టమర్లు వారి వ్యాపారాన్ని మా ప్రొడక్టుల సాయంతో మరింత నాణ్యమైన అనుభవం ఉండేలాగా విస్తరించుకోవచ్చు.