తెలంగాణలో ఇవాళ కొత్తగా 129 కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ కరోనా సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా నిర్ధారణ అయిన వారి సంఖ్య 3 వేల మార్క్ దాటింది. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 129 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 108 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 6 చొప్పు, మేడ్చల్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 2 చొప్పున కరోనా బారిన పడ్డారు. యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున కరోనా సోకినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 3,020కు చేరింది. ఇవాళ కరోనా మహమ్మారికి ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 99కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,556 మంది బాధితులు కోలుకొని ఇళ్లకు వెళ్లిపోగా.. 1,365 మంది చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.











