సీఎం కెసిఆర్ కార్లకే చలాన్ వేసిన పోలీసులు

రాష్ట్ర ముఖ్యమంత్రి కార్లకే చలాన్ వేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. సీఎం కెసిఆర్ కాన్వాయ్ లోని కార్లు ఓవర్ స్పీడ్ గా వెళ్తున్నాయి అని చలాన్ విధించారు పోలీసులు. సూర్యపేట పరిధిలోని శ్రీరంగపురంలో  2019 అక్టోబర్ 16 వ తేదీన, సైబరాబాద్ పరిధిలో 100 ఫీట్ రోడ్ లో  2020 ఏప్రిల్ 15 న, హైదరాబాద్ పరిధిలోని టిప్పుఖాన్ బ్రిడ్జి వద్ద  ఏప్రిల్ 29 న, మళ్ళీ హైదరాబాద్ పరిధిలో చిల్డ్రన్ పార్క్ ట్యాంకుబండ్ పై ఈ నెల 1 వ తేదీన పరిమితికి మించి వేగంగా వెళ్తున్నారని 4000 రూపాయల చలాన్ విధించారు. యూసర్ చార్జెస్ తో కలిపి 4140 చలాన్ సీఎం కెసిఆర్ కార్లకి విధించారు. అయితే ఇప్పుడు ఈ చలాన్లను ప్రభుత్వం కడుతుందా లేక కెసిఆర్ కడుతాడా అనే సందేహం నెటిజెన్ లలో ఉంది. మరో వైపు భాద్యత గల రాష్ట్ర ముఖ్యమంత్రి చలాన్ పడేలా ఓవర్ స్పీడ్ వెళ్లడం మరియు ఆ చలాన్లు గత సంవత్సరం నుండి పెండింగ్ లో పెట్టడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు