చేగుంటలో ఏడుగురికి కరోన పరీక్షలు
ఇటీవల మెదక్ జిల్లా చేగుంటలో ఓ కండాక్టర్ కుటుంబానికి కరోనా సోకింది. దీంతో ఆ పట్టణం అంతా భయం గుప్పిట్లో వెల్లదీస్తోంది. కాగా ఆ కండాక్టర్ కూతురు కూడా చేగుంటలో ఉండడం తరచూ అతని ఇంటికి వెళ్లడం జరిగిందని అధికారులు సమాచారం సేకరించారు. కరోనా గురించి వైద్యులు, అధికారులు వారికి పూర్తి అవగాహాన కల్పించి కరోన పరీక్షల కోసం వారి రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. కాగా ఆ ఫలితాలు వచ్చే వరకు వారు కార్వంటైన్‌లోనే ఉండాలని సూచించారు. గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో చేగుంటలో తీసుకుంటున్న చర్యలను జిల్లా అధికారులు పరీశీలించారు.











