ఆయన కల నిజంగానే నెరవేరింది : తెజస
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన కుమారుడు కల్వకుంట్ల తారకరామారావు కల నెరవేరింది అని హెద్ధేవ చేసారు మెదక్ జిల్లా తెలంగాణ జనసమితి పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు వి. రాజశేఖర్ రెడ్డి. దేశంలో తమ కంటే మంచి పాలన ఎవరు అందిచడం లేదని ఇన్నాళ్లు కల్వకుంట్ల కుటుంబం గొప్పలు చెప్పుకుందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు జనరంజక పాలన అందిస్తే సర్వేలలో ఎందుకు మొదటి స్థానం రాలేదు అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడ కూడా లేని రైతుబంధు పథకం తీసుకొస్తే ప్రజలు ఎందుకు ఛీ కొడుతున్నారు అన్నారు. కెసిఆర్ పాలనా కేవలం ఆయన చెప్పే విలేకరుల సమావేశాలకు మాత్రమే పరిమితం అంతే కానీ గ్రామాల్లో వారు అనుకునంతగా పాలనా ఏమి సాగడం లేదని అన్నారు. కరోనా మరణాలపై కూడా రాజకీయం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మంది పడ్డారు. లాక్ డౌన్ సడలింపులు చేసి కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ కావడానికి ప్రధాన కారణం సీఎం అని ఆరోపించారు. ఇలా చెప్పుకుంటే పోతే రాయడనికి పేజీల సరిపోవని అన్నారు. అందుకే దేశంలో ముఖ్యమంత్రుల మీద సి- ఓటర్ సర్వే నిర్వహించిన సర్వేలో ఆయన కోరుకున్న సంఖ్య ఆరు – పదహారు వచ్చింది అని అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికలలో సీఎం కల ఇప్పుడు ఈ విదంగా నెరవేరిందని అన్నారు.