హైదరాబాదులో మ‌ళ్లీ డ్ర‌గ్స్ దందా

డ్ర‌గ్స్ విక్ర‌య‌దారులు రూట్ మార్చారు. క‌రోనా లాక్‌డౌన్‌ని విచ్చల విడిగా వాడుకుంటున్నారు. పెద్ద పెద్ద ప‌ట్ట‌ణాల్లో డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేయాలంటే మామూలు విష‌యం కాదు. డేగ క‌ళ్లు ఎప్పుడు ఏటు నుంచి వెంటాడుతాయో ఎవ‌రికీ తెలియ‌దు. అందుకే ఆ కేటుగాళ్లు పోలీసుల‌ను బురిడీ కొట్టించే ప్ర‌య‌త్నంలో అడ్డంగా దొరికిపోయారు. లాక్‌డౌన్‌లో భాగంగా ప్ర‌భుత్వం జారీ చేసిన ఈ పాస్‌ల‌ను వాడుకొని దందాను మూడు ‌పూలు, ఆరు కాయ‌లు సాగిస్తున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే…. ఫేస్ మాస్క్ ల పేరుతో ఇరు రాష్ట్రాల్లో తిరుగుతూ డ్రగ్స్ విక్రయిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ విక్రయాలు స‌ర‌ఫ‌‌రా చేస్తున్నారు. ప‌ట్టుబ‌డిన ముఠా నుండి ముగ్గురు దగ్గర నుంచి 54 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు తెలిపారు. బెంగళూరులోని నైజీరియన్ నుంచి హైదరాబాద్ వాసులు 70 గ్రాముల కొకైన్ కొనుగోలు చేశార‌ని వివ‌రించారు. హైదరాబాద్ కు చెందిన పరంజ్యోతి సింగ్ ,అమిత్ కుమార్ ను అరెస్టు చేసిన ఎక్సైజ్ అధికారులు. కొవిడ్ రవాణా పాసులు తీసుకొని డ్రగ్స్ వ్యాపారం
చేస్తున్నార‌ని విచార‌ణ‌లో తేలింది.