నేరవేరిన సారు+కారు =16
ఆరు ఈ నెంబర్ అంటే మన సీఎం కేసీఆర్‌కి ఎనలేని ప్రేమ. తాను ప్రయాణించే కార్ల కాన్వయ్‌లో అన్ని బండ్లకు 6666 నెంబర్ ఉంటుంది. సార్ ఏ పని చేయాలన్నా… 6 వచ్చేలా చేయడం మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తునే ఉన్నాం.
ఇక సారు+ కారు=16 ఇది గత ఏడాది తెలంగాణలోని ప్రతి గులాబీ కండువ కప్పుకున్న వారి మదిలో నాటుకుపోయిన పదం. అంతేకాదు సీఎం కుమారుడు మంత్రి కేటీఆర్ నోట కూడా ఈ పదం లక్షల సార్లు విన్నాం. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లే లక్ష్యంగా పని చేయాలని టీఆర్ఎస్ శ్రేణులు అహార్నిషలు పని చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లు గెలిచి ఢిల్లీలో పీఠం మనమే తిప్పుతామని కేటీఆర్ అనేక సమావేశాల్లో చెప్పారు. కానీ తెలంగాణ ప్రజలు వారి అంచనాలు తల కిందులు చేస్తూ… సారు కారును పంక్షర్ చేసి, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మద్దతు ప్రకటించారు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే…. సీఎం కేసీఆర్‌కి ఇష్టమైన 16 సంఖ్య అతని వచ్చింది. దేశంలో సీ-ఓటర్ సర్వే నిర్వహించిన సర్వేలో…తెలంగాణ సీఎం కేసీఆర్ 16వ స్థానం దక్కించుకున్నారు. కేసీఆర్‌కి ఇష్టమైన లక్కీ నెంబర్ 6 వచ్చిందని, గత పార్లమెంట్ సీట్లలో 16 సీట్లు వస్తాయనుకుంటే దేశంలో 16వ స్థానంలో ఉత్తమ సీఎంగా నిలిచారు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఏదీ ఏమైన తెలంగాణలో గత కొన్ని రోజులుగా వస్తున్న పరిణామాలు చూస్తుంటే… తెలంగాణలో ఊహించని విధంగా ఏదో జరుగుతాయని రాజకీయ వర్డాల్లో తీవ్ర చర్చ జరగుతోంది.