భయం గుప్పిట్లో చేగుంట
బయటకు వెళ్లాలంటే… భయం, పక్కన ఉన్నవారిని కలవాలి అంటే భయం, బంధువులు వస్తున్నారంటే భయం. ఇప్పుడూ చేగుంటలో ఎవరిని కదిలించిన అంతా భయం భయం. ఇది అంతా కరోనా మహమ్మరి సృష్టించిన భయం. గత కొన్ని రోజులుగా చేగుంట పట్టణంలో కంటి నిద్రపోయిన దాఖలాలు లేవు. ఎక్కడా మాకు కరోనా అంటుకుంటుదో అని భయం గుప్పిట్లో… ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు.
పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోన రావడం అందరిని ఉల్కిపడేలా చేసింది. వారి చుట్టు పక్కల ఉన్నదాదాపు 50 మందిని కార్వంటైన్ తరలించారు. ఇప్పుడు బయట రోడ్లమీద ఎవ్వరిని కూడా తిరగనీయడం లేదు. చాపకింద నీరులా కరోనా విస్తరిస్తుడడంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాకు వలస కూలీలు, ఇతర పట్టణాల నుండి ఎవరేవరు వస్తున్నారని ఆరా తీసుకున్నారు. ప్రయాణాలు చేస్తున్న వారి వివరాలు పక్కగా సేకరిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు ఉంటే గ్రామాల్లోని అధికారులకు తేలియజేయాలని పోలీసులు ప్రజలకు వివరిస్తున్నారు. అత్యవసరమైతే తప్పా బయట తిరగవద్దని సూచిస్తున్నారు.











