కేసీఆర్ కంటే జ‌గ‌నే బెస్ట్ సీఎం

తెలంగాణ‌లో కేసీఆర్ చేసిన‌న్ని ప‌నులు దేశంలో ఏ సీఎం కూడా చేయ‌లేద‌ని పార్టీ నాయ‌కుల నుండి కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు డ‌బ్బా కొట్టేవాళ్లే… కానీ సర్వే సంస్థ ‘సీ ఓటర్‌’ నిర్వ‌హించిన స‌ర్వేలో మాత్రం ప‌క్క రాష్ట్ర సీఎం జ‌గ‌న్ కంటే త‌క్కువ మార్కులు వ‌చ్చాయి. మనం చూస్తున్న నాటి నుండి ఏపీలో జ‌గ‌న్ సార్‌కి వ్య‌తిరేక‌త బాగానే ఉన్న‌ట్లు క‌నిపించింది. కానీ స‌ర్వేలో మాత్రం ఎందుక‌లా వ‌చ్చాయి అని ఇప్పుడు అంతా ఆలోచ‌న‌లో ప‌డ్డారు.
టాప్‌-5 లో సీఎం జగన్‌
ఇక ముఖ్యమంత్రులపై ‘సీ ఓటర్’‌ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్రను తిరగరాస్తూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దేశ వ్యాప్తంగా టాప్‌-5 సీఎంల జాబితాలో చోటు దక్కింది. ప్రభుత్వ నిర్ణయాలు, పనితీరు ఆధారంగా ఈ సర్వే రూపొందించగా.. సీఎం జగన్‌కు 78.1శాతం మంది ప్రజల మద్దతు లభించింది. నాలుగో స్థానంలో సీఎం జగన్‌ చోటు దక్కించుకున్నారని సీ ఓటర్‌ సర్వే నివేదికలో తెలిపింది. ముఖ్యమంత్రిగా పాలనాబాధ్యతలు స్వీకరించిన తొలి ఏడాది కాలంలోనే అనేక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపింది. ఇక అత్యధిక ప్రజాదరణ లభించిన ముఖ్యమంత్రి జాబితాలో ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్ తొలి స్థానంలో ‌ఉండగా, తరువాత స్థానాల్లో ఛత్తీస్‌గఢ్‌‌, కేరళ ముఖ్యమంత్రులు భూపేశ్‌ వాఘేలా, పినరయి విజయన్‌ ఉన్నారు. ఐదో స్థానంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నిలిచారు.