మెద‌క్ బీజేపీ నూత‌న అధ్య‌క్షుడిని క‌లిసిన చేగుంట నేత‌లు

డెక్క‌న్ న్యూస్‌, మెద‌క్ ప్ర‌తినిధి శ్రీకాంత్ చారి :
ప్రధాని మోడీ ఆశ‌యాల‌ను ప్ర‌తి ప‌ల్లెకు తీసుకవెళ్ల‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని మెద‌క్ జిల్లా భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు గ‌డ్డం శ్రీనివాస్ అన్నారు. పార్టీలో ప‌ద‌వులు పొంద‌డం అంటే ఏదో పెత్త‌న్నం చేలాయించ‌డం కాద‌ని అది మ‌రింత బాధ్య‌తని పెంచుతుంద‌న్నారు. నిత్యం మ‌నం ఇంకా క‌ష్ట‌ప‌డాల‌ని మ‌న ప‌ద‌వి మ‌న‌కు గుర్తు చేస్తుంద‌ని తెలిపారు. జిల్లా నూత‌న అధ్య‌క్షుడిగా ఎన్నికైన త‌న‌ని క‌ల‌వ‌డానికి వ‌చ్చిన వారికి ఆయ‌న కృతజ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ‌
చేగుంట బీజేపీ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి భూపాల్ గారు జిల్లా నాయకులు గోవింద్, బిక్షపతి, చంద్రశేఖర్ గౌడ్,సంతోష్ రెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు శ్రీనివాస్ ని క‌లిసి అభినంద‌న‌లు తెలిపారు. జిల్లాలో పార్టీ ప‌టిష్ట‌తు తామంద‌రు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని అధికార పార్టీ నాయ‌కుల ఆగ‌డాల‌కు అడ్డుక‌ట్ట వేయాల‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ఇస్తున్న ప‌థ‌కాల గురించి గ్రామాల్లో విసృత్త ప్ర‌చారం చేయాల‌ని త్వ‌ర‌లో ప్ర‌ణాళిక చేయాల‌ని ఎల్లారెడ్డి అధ్య‌క్షుడిని కోరారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మెద‌క్‌లో క‌మ‌లం విక‌సించేలా ప్ర‌తి ఒక్క‌రూ క‌ష్ట‌ప‌డుతామ‌ని హామీ ఇచ్చారు.