టి.మందాపూర్‌లో ఆ పంటలు వేసి ఎక్కువ లాభాలు పొందండి
డెక్కన్ న్యూస్, మెదక్ ప్రతినిధి శ్రీకాంత్ చారి :
నియంత్రిక పంటల ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చని మండల వ్యవసాయ విస్తరణ అధికారి శ్యాం అన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని టి.మాదంపూర్ గ్రామంలో రైతులను వానకాలం పంటల గురించి అవగాహాన కల్పించారు. ప్రభుత్వం సూచించన విధంగా పంటలు వేస్తే అధిక దిగబడులు వస్తాయని తెలిపారు. సన్నరకం పంటలు, పత్తి, కంది తదితర పంటు వేయడం ద్వారా రైతులకు ఇబ్బందులు తక్కువ స్థాయిలో ఉంటాయన్నారు. మొక్కజొన్న పంటలు వేయడం వల్ల కంకి పెట్టే దశలో, అలాగే వలిచే దశలో వర్షాల వల్ల బుజు పట్టే ప్రమాదం ఉందన వివరించారు. ప్రభుత్వం రైతుల అభివృద్ధి దృష్టిలో ఉంచుకొని మంచి పథకాలను అందుబాటులోకి తీసుకొస్తోందని తెలిపారు. ఈ అవగాహాన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బిక్షపతి గౌడ్, ఉప సర్పంచ్ పుట్టి మహేందర్, ఎంపీటీసీ ప్రసాద్ గౌడ్‌తో పాటు రైతులు పాల్గొన్నారు.











