రంగనాయక, మల్లన్న సాగర్ కాలువ భూ సేకరణ పై మంత్రి హరీశ్ రావు సమీక్ష

సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ఉదయం రంగనాయక, మల్లన్న సాగర్ జలాశయాల ప్రధాన కాలువ నుంచి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్స్ ద్వారా వెళ్లే డిస్ట్రిబ్యూటరీ కాల్వలు అంశం పై జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, అడిషనల్ జిల్లా కలెక్టర్ పద్మాకర్, ఆర్డీఓ అనంతరెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్ఈ ఆనంద్, ఇరిగేషన్ ఈఈ రవీందర్ రెడ్డి, సిద్ధిపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, ఆర్ఐ, వీఆర్వోలు, ఇరిగేషన్ అధికారులతో కాల్వల భూ సేకరణ పురోగతి పై మంత్రి హరీశ్ రావు సమీక్ష.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీ రంగనాయక, శ్రీ కొమురవెళ్లి మల్లన్న రిజర్వాయర్ల ప్రధాన కాలువ, కుడి, ఎడమ కాలువ పనులు పూర్తయ్యాయని, ప్రధాన కాలువలకు అనుసంధానంగా నిర్మించనున్న పంపిణీ కాలువల భూ సేకరణను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో శరవేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.