బీజేపీ నేత రఘునందర్‌రావు జోక్యంతో బాధిత కుటుంబానికి న్యాయం
డెక్కన్ న్యూస్, మెదక్ ప్రతినిధి శ్రీకాంత్ చారి
మెదక్ జిల్లా బీజేపీ నేత రఘునందర్‌రావు జోక్యంతో ఒక ఘటనలో చనిపోయిన కుటుంబానికి న్యాయం జరిగింది. అన్యాయంగా ఓ ఫ్యాక్టరీ యాజమాన్యం తన బలంతో బాధిత కుటుంబానికి అన్యాయం చేయాలని చూస్తే దేవుడిలా రఘునందన్ రావు ఆదుకున్నారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే…
మెదక్ జిల్లా చేగుంట మండల భాజపా సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ గౌడ్ వాళ్ళ బంధువు సూరరం వాస్తవ్వులు మొన్న రాత్రి AC Tires IDA Bolaramlo కంపెనీ లో అనుమనస్పదంగా చనిపోవడం జరిగింది. ఈ విషయాన్ని కంపెనీ యాజమాన్యం పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాని ఒక ప్రైవేట్ హాస్పిటల్ నుండి అక్కడి నుండి గాంధీ మార్చురీకి తరలించారు.
ఆ విషయం తెలుసుకున్న బంధువులను బెదిరించి లక్ష లేదా రెండు లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుందాం అన్ని చూశారు.
ఏం చేయాలో అర్థం కాక రఘునందన్ రావుకి ఫోన్ చేశారు. ఫోన్ చేసిన వెంటనే స్పందిచిన రఘునందన్‌రావు ఊట ఊటీన బాచూపల్లి పోలీసు స్టేషన్ కి వెళ్లారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు కంపెనీ యాజమాన్యం పోలీసులతో చర్చలు జరిపారు. తరువాత 14లక్షలు మరియు PF అమౌంట్ కింద 3లక్షలు వెంటనే ఇప్పించే ఏర్పాట్లు చేశారు. దీంతో బాధిత కుటుంబ సభ్యలు రఘునందన్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. కాగా చనిపోయిన వ్యక్తికి ఇద్దరు అమ్మాయిలు ఒక కొడుకు ఉన్నారు.