పీపీఈ  కిట్లు వేసుకున్నా మాజీ ఎమ్మెల్యేను వదలని కరోనా

వదల బొమ్మాలి నిన్ను వదల అనేది ఒక సినిమా డైలాగ్. భూమిలో పాతి పెట్టిన బయటకి వచ్చి నీపని పడితే అనేది ఆ డైలాగ్ ఉద్దేశం. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెబుతున్నాను అంటే…. అచ్చం అలాంటిదే నిజ జీవితంలో జరుగుతుంది.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా పీపీఈ కిట్లు వేసుకున్న వదలడం లేదు. ఈ కిట్లు వేసుకుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా రక్షణ లేకుండా పోతోంది. కరొనకి కనీసం మందు కూడా లేదు మన రక్షణనే మనకు శ్రీరామ రక్షణ.  కానీ ఆ రక్షణ కూడా ప్రజలను కాపాడలేకపోతోంది. వివరాల్లోకి వెళ్తే
కరోనా వచ్చిన నాటి నుండి అనేక మంది మానవతా కోణంలో అనేక రకాలుగా ప్రజలకి సేవలు చేస్తున్నారు. అలాగే ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి గత 50  రోజుల పేద ప్రజలకు, జిఎచ్ఏంసి కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణి చేస్తున్నారు. ఆలా చేసే సమయంలో పీపీఈ కిట్లు ధరించిన ఆయన్ని కరోనా వదలలేదు. పీపీఈ కిట్ల పనితీరు ఎలా ఉన్నదో అర్ధం అవుతుంది.
చింతలకు కరోనా సోకింది అని హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రి వర్గాలు ధ్రువీకరించాయి. అతనికి నిత్యావసర సరుకుల పంపిణి చేసినప్పుడే కరోనా సోకి ఉన్దవఃహు అని డాక్టర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  
కరోనా కేసులు మొదలైన నాటి నుండి వివిధ ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు డాక్టర్లు వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే చింతల కేసు దృష్ట్యా చూస్తే ఎంత మందికి డాక్టర్లకు
కరోనా వచ్చిందో అనే అనుమానం ఉంది.
చింతల రామచంద్ర రెడ్డికి కరోనా సోకడంతో కేంద్ర హోమ్ సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.