భయం గుప్పిట్లో ఘట్‌కేసర్
ఆర్టీసీ బస్సు ప్రయాణం ఎంతో సురక్షితం, సౌకర్యవంతం ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఆర్టీసీ ప్రయాణం ప్రాణాలతో చెలగాటలం. కరోనా వైరస్ ఒకచోటు నుంచి మరో చోటు వరకు ఎలా ప్రయాణిస్తోందో తెలియడం లేదు. ఇటీవల లాక్ డౌన్ సడలింపులలో భాగంగా… ఆర్టీసీ బస్సులు జిల్లాల నుండి నగర శివారు వరకు తిరుగుతున్నాయి. ఆర్టీసీ బస్సుకు ఘట్‌కేసర్‌కి ఎంటా సంబంధం అనుకుంటున్నారా.. అది ఎంటో తెలియాలి అంటే ఈ కథనం చదవాల్సిందే…
జనగాం జిల్లా చిల్పూరు మండలం నష్కల్ గ్రామానికి చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కి కరోనా సోకింది. అతను వరంగల్, హన్మకొండ నుండి హైదరాబాద్ వరకు బస్సు నడిపినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న సమయంలో ఘట్‌కేసర్‌లో ఇద్దరు వ్యక్తులు దిగినట్టు సమాచారం. అయితే అది ఎవరు అనేది సరైన సమాచారం లేదు. వారు అక్కడ దిగి ఏదైన గ్రామాలకు వెళ్లారా లేదా ఘట్‌కేసర్‌లోనే ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది. కాగా ఇప్పటికే ఘట్కేసర్ నుండి వలసకూలీలతో వివిధ రాష్ట్రాలకు రైళ్లు వెళ్లాయి. ఆ సమయంలో ఎవరికైన కరోనా ఉంటే.. అక్కడ ఉన్న వారికి ప్రమాదమనే చెప్పవచ్చు. ఇప్పుడు ఏకంగా కరోన సోకిన వ్యక్తితో బస్సు ప్రయాణం చేశారు. కాగా మరోవైపు వైరస్ లక్షణాలు 14 నుండి 28 రోజుల వరకు తెలియడం లేదు. దీంతో ఘట్‌కేసర్ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ప్రభుత్వం చర్యలు చేపడుతున్న అవగాహాన లోపంతో ప్రజలు నిబంధనలు సరిగా పాటించకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏదీ ఏమైన ఘట్‌కేసర్ వాసులకు కరోనా వైరస్ దరి చేరకుడదని కోరుకుందాం.











