ఆ కేసుల్లో సరికొత్త రికార్డు సృష్టిస్తున్న భారత్
ప్రపంచం అంతా అనున్నట్టు అదే అవుతోంది. భారత్‌లో కరోనా కేసులు అదుపులోకి రావడం లేదు. నిత్యం వేల కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా లాక్ డౌన్ సడలింపులు తర్వాత కరోనా వైరస్ తన ప్రాతానాన్ని చూపిస్తోంది. కేసుల నమోదులో రోజురోజుకూ కొత్త రికార్డులు నమోదవుతూనే ఉన్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 8,380 వైరస్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే ఇన్ని కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం అధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్(190,609 కేసులు) ఏడో స్థానంలో నిలిచింది.
తొలి ఆరు స్థానాల్లో వరుసగా అమెరికా, బ్రెజిల్, రష్యా, స్పెయిన్, బ్రిటన్, ఇటలీ దేశాలు ఉన్నాయి. ఈ వివరాల్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో ఇప్పటి వరకూ 65,168 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.