మెద‌క్‌లో క‌ల‌క‌లం రేపుతున్న క‌రోనా కేసులు

డెక్క‌న్ న్యూస్‌, మెద‌క్ ప్ర‌తినిధి శ్రీ‌కాంత్ చారి :
మెద‌క్ జిల్లాలో ప్ర‌జ‌లను భ‌యం గుప్పిట్లో ప‌డేస్తోంది క‌రోనా. వ‌ర‌సుగా రెండు రోజుల‌గా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డంతో అధికారుల‌లో క‌ల‌వ‌రం మొద‌లైంది. ఇప్ప‌టి వ‌ర‌కు అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా కేసులు ఎందుకు న‌మోదు అవుతున్నాయి అనేది అంతు చిక్క‌డం లేదు. శ‌నివారం చేగుంట‌, పాప‌న్న‌పేట‌లో రెండు కేసులు కాగా… ఆదివారం జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో 3 కొత్త కేసులు వ‌చ్చాయి. ఇప్ప‌టికైన ప్ర‌జ‌లు ప‌రిస్థితుల‌ను అర్ధం చేసుకొని లాక్ డౌన్ స‌డ‌లింపుల‌ను జాగ్ర‌త్త‌గా వినియోగించుకోవాల‌ని అధికారులు కోరుతున్నారు.