విమర్శలు ఆపడానికే ఆ కొత్త పల్లవి అందుకున్న సీఎం : తెజస
డెక్కన్ న్యూస్, మెదక్ ప్రతినిధి శ్రీకాంత్ చారి
రైతుల నుంచి వస్తున్న విమర్శలను అడ్డుకోవడానికే సీఎం కేసీఆర్ కొత్త పల్లవి అందుకున్నారని మెదక్ జిల్లా తెలంగాణ జన సమితి యువజన విభాగం అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం చెప్పిన పంటలు ఎట్లా వేస్తామని గ్రామాల్లో అధికారులకు నిత్యం అడ్డంకులు ఎదురవడంతో సీఎం కొత్త మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. నిజంగా రైతుల పక్షపాతి అయితే గోదావరి జలాలు తీసుకొచ్చినాడో ఆ విషయం చెబితే రైతులు సంతోషించే వారో, విమర్శించే వారో తేలిపోయోది అన్నారు. వానకాలం పంటలు మెదలుకాక ముందు రైతుల నుండి వస్తున్న వ్యతిరేకతను పక్కదోవ పట్టించడం కోసమే ఈ నేతి బీరకాయ మాటలు అని మండిపడ్డారు. కాంగ్రెస్ హాయంలో కట్టిన ప్రాజెక్టుల కింద సాగు చేసిన పంటలను తన ఖాతాలో వేసుకొని సీఎం మాట్లాడుతున్నారని ఆరోపించారు. శ్రీరాం సాగర్ ఆయకట్ట కింద ఎంత సాగు చేశారో… కాళేశ్వరం నీళ్లతో ఎంత సాగు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతేకానీ రైతులను మభ్యపెట్టి ఎంతకాలం రాజకీయాలు చేస్తారని ప్రశ్నించారు.











